ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మికతకు ఆలవాలం

ABN, First Publish Date - 2022-12-31T00:12:57+05:30

ఆధ్యాత్మికతకు ఆలవాలంగా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహక్షేత్రం విరాజిల్లుతోందని భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అభివర్ణించా రు. శుక్రవారం ఆమె కుమార్తె ఇతిశ్రీముర్ము, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి యాదగిరిక్షేత్రాన్ని సం దర్శించారు. అయితే ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ కన్నా ఐదు నిమిషాల ముందుగానే ఆమె యాదగిరిక్షేత్రానికి చేరుకోగా.. షెడ్యూల్‌ కన్నా 20నిమిషాల ముం దుగానే తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరి వెళ్లారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ఉదయం 9.25గంటలకు యాదగిరికొండ కింద పాత గోశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనీవినీ ఎరుగని రీతిలో గుట్ట ఆలయ అభివృద్ధి

రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, మంత్రులు

ఆలయ తిరువీధుల్లో కలియదిరిగిన రాష్ట్రపతి

20నిమిషాల ముందుగానే బయలుదేరిన ద్రౌపదీముర్ము

యాదగిరిగుట్ట, డిసెంబరు 30: ఆధ్యాత్మికతకు ఆలవాలంగా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహక్షేత్రం విరాజిల్లుతోందని భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అభివర్ణించా రు. శుక్రవారం ఆమె కుమార్తె ఇతిశ్రీముర్ము, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి యాదగిరిక్షేత్రాన్ని సం దర్శించారు. అయితే ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ కన్నా ఐదు నిమిషాల ముందుగానే ఆమె యాదగిరిక్షేత్రానికి చేరుకోగా.. షెడ్యూల్‌ కన్నా 20నిమిషాల ముం దుగానే తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరి వెళ్లారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ఉదయం 9.25గంటలకు యాదగిరికొండ కింద పాత గోశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. హెలీప్యాడ్‌ వద్ద రాష్ట్రపతి ముర్ము కు మంత్రులు సత్యవతి రాథోడ్‌, గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, కలెక్టర్‌ పమేలాసత్పథి ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్‌ నుంచి ఆమె కాన్వాయ్‌లో కొండపైకి సహాయ సిబ్బందితో తరలివెళ్లారు. కొండపైన పడమటి దిశలోని లిఫ్టు వద్దకు కాన్వాయ్‌ చేరుకుంది. అక్కడినుం చి లిఫ్టు గుండా ఆలయ తిరుమాఢ వీధిలోకి చేరుకున్నా రు. ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం వద్ద ఆమెకు ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూ ర్తి, ఈవో గీతారెడ్డిలు ఆహ్వానం పలుకగా ఆలయ అర్చకబృందం సంప్రదాయరీతిలో పూర్ణకుంభంతో వేదమంత్రపఠనాలు, మంగళవాయిద్యాలతో స్వాగతంపలికారు. ఆమె ప్రధానాలయ త్రితల రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకుని ముఖమండపంలోని ధ్వజస్థంభం, బలిపీఠం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వయంభువులు కొలువుదీరిన గర్భాలయంలోకి వెళ్లారు. గర్భాలయంలో అర్చకులు సంకల్పంతో సువర్ణ పుష్పార్చన పూజలు జరిపి హారతి, శఠగోపం అందజేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకబృందం, వేదపండితులు చతుర్వేదాలతో ఆశీర్వచనం జరిపారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అనిల్‌ కుమార్‌లు స్వామివారి చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేయగా.. ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

పూర్వజన్మ సుకృతం

రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ స్వయంభువుల దర్శనం పూర్వజన్మ సుకృతమన్నారు. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా ఆలయ నిర్మాణం కొనసాగిందని, కనీవినీ ఎరుగని రీతిలో ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. ముందుగా ఆలయ ఈవో గీతారెడ్డి ఆమెకు పూలమాలను అందజేయగా.. ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని అద్దాల మండపాన్ని సందర్శించగా అద్దాల మండపం ఎదుట ఏర్పాటు చేసిన ఆలయ పునర్నిర్మాణ పనులను తెలిపే ఫొటో ప్రదర్శనను ఆమె వీక్షించారు. ఆమెకు ఈవో గీతారెడ్డి విస్తరణ పనులు కొనసాగిన తీరు ఫొటోల వివరాలను వివరించారు. అనంతరం ఆమె ఉత్తర పంచతల రాజగోపురం గుండా బయటకు రాగా దేవస్థాన సిబ్బంది, మంత్రులు, తదితరులతో కలిసి ఫొటోలు దిగి కొండకిందకు కాన్వాయ్‌లో సహాయక సిబ్బందితో కలిసి వెళ్లారు. సుమారు 10.30గంటలకు హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్న ఆమె కుమార్తె ఇతిశ్రీముర్ము, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసానికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో తరలివెళ్లారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిన భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటనకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ ఆధ్వర్యంలోని డీసీపీ కె.నారాయణరెడ్డి పటిష్ట బందోబస్తు నిర్వహించగా అదనపు కలెక్టర్‌ ఎంవీ భూపాల్‌రెడ్డి, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు.

రాష్ట్రపతి పర్యటన కొనసాగిందిలా..

ఉదయం 9.25గంటలకు కొండకింద పాత గోశాల వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగారు.

9.30: హెలీప్యాడ్‌ వద్ద రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు.

9.32: కాన్వాయ్‌లో ఆలయ మూడవ ఘాట్‌రోడ్‌ గుండా కొండపైకి వెళ్లారు.

9.35: ఆలయ పడమటి దిశలోని లిఫ్టు వద్దకు కాన్వాయ్‌ చేరుకుంది.

9.41: ఆలయ తిరుమాఢవీఽధిలో ద్రౌపదీముర్ముకు మంత్రులు, ప్రభుత్వ విప్‌తో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం తెలిపారు.

9.42: ప్రధానాలయ ఉత్తర రాజగోపురం వద్ద రాష్ట్రపతి ముర్ముకు ఆలయఅర్చకులు సంప్ర దాయరీతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

9.43: ప్రధానాలయంలోనికి ఆమె ప్రవేశించారు.

9.45: ప్రధానాలయంలో ధ్వజస్థంభం, బలిపీఠంల చెంత మొక్కులు తీర్చుకున్న రాష్ట్రపతి

9.46: రాష్ట్రపతి కుమార్తె ఇతిశ్రీముర్ము, గవర్నర్‌ తమిళిసైతో కలిసి గర్భాలయంలోనికి వెళ్లారు.

9.50: అర్చకులు గర్భాలయంలో పూజలనంతరం హారతి అందజేశారు.

9.52: గర్భగుడి నుంచి ఆమె బయటకు వచ్చారు.

9.53: ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆశీనులయ్యారు.

9.55: అర్చకస్వాములు రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు ఆశీర్వచనం నిర్వహించారు.

9.56: స్వామివారి చిత్రపఠంతో కైడిన జ్ఞాపికను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అనీల్‌కుమార్‌లు అందజేశారు.

9.57:ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసిం హమూర్తి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

9.57: ఆలయ ఈవో గీతారెడ్డి స్వామి,అమ్మవార్ల శేషవస్త్రాలు అందజేశారు.

9.58: ఆలయం నుంచి బయటకు వచ్చారు.

10గంటలకు ఆలయ అష్టభుజి ప్రాకార మండపం లోని అద్దాల మండపాన్ని సందర్శించారు.

10.02: అద్దాల మండపం ముందు ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించగా ఈవో గీత ఆలయ పునర్నిర్మాణ పనుల వివరాలను వివరించారు.

10.06: ప్రధానాలయం బయటకు వచ్చారు.

10.08: దేవస్థాన సిబ్బంది, మంత్రులతో కలిసి ఫోటోలు దిగారు.

10.12: బాలాలయం ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఆర్‌సీసీ ర్యాంపు గుండా కొండకిందకు తరలివెళ్లారు.

10.13: కాన్వాయ్‌లో కొండకిందకు తరలివెళ్లారు.

10.18: మూడవ ఘాట్‌రోడ్‌ గుండా హెలీప్యాడ్‌ వద్దకు కాన్వాయ్‌లో వెళ్లారు.

10.20:కొండకింద హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు.

10.30గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అందరికి వీడ్కోలు పలుకుతూ తిరిగి ప్రత్యేక హెలీక్యాప్టర్‌ లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు.

Updated Date - 2022-12-31T00:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising