ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీరింగ్‌ వీల్‌ లేని చోదక రహిత కారు

ABN, First Publish Date - 2022-07-22T08:50:20+05:30

కృత్రిమ మేధ సాయంతో సొంతంగా నడిచే చోదక రహిత కార్ల గురించి మనందరికీ తెలుసు! అలాంటి కార్లలో స్టీరింగ్‌ వీల్‌ కూడా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చైనా టెక్‌ దిగ్గజం బైడు ఆవిష్కరణ..
  • అపోలో ఆర్‌టీ6.. 
  • ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కారులో 38 సెన్సర్లు


కృత్రిమ మేధ సాయంతో సొంతంగా నడిచే చోదక రహిత కార్ల గురించి మనందరికీ తెలుసు! అలాంటి కార్లలో స్టీరింగ్‌ వీల్‌ కూడా ఉంటుంది. కానీ.. చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘బైడు’ అసలు స్టీరింగ్‌ వీలే లేని చోదక రహిత వాహనాన్ని ఆవిష్కరించింది. కావాలనుకుంటే స్టీరింగ్‌ వీల్‌ అమర్చే ఏర్పాటూ చేసింది. ఆ సంస్థ ఇప్పటికే చైనాలో ‘అపోలో గో’ పేరుతో డ్రైవర్లు లేని రోబో ట్యాక్సీ సేవలందిస్తోంది. ‘అపోలో గో’ ట్యాక్సీ ల శ్రేణిలో చేర్చడానికే అభివృద్ధి చేసిన ఈ ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ’ పేరు.. అపోలో ఆర్‌టీ6. డ్రైవర్‌, స్టీరింగ్‌ వీల్‌ లేకున్నా 20 ఏళ్లపాటు రోడ్లపై కారు నడిపిన అనుభవం ఉన్న డ్రైవర్‌తో సమానమైన నైపుణ్యం ఈ కారుకు ఉందని బైడు సంస్థ చెబుతోంది. ఈ కారు ఖరీదు చైనాలో 2,50,000 యువాన్లు. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.30 లక్షలు! 2023 జూన్‌ తర్వాత లక్ష ‘అపోలో ఆర్‌టీ6’ కార్లను రోడ్లపైకి తేవాలని బైడు సంస్థ యోచిస్తోంది. ఏవైపు నుంచీ ప్రమాదానికి ఆస్కారం లేకుండా ఈ కారులో 38 సెన్సర్లను అమర్చారు. వాటిలో 8 లైట్‌-డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ (లైడార్‌) సెన్సర్లు కాగా.. ఒకటి 6ఎంఎం వేవ్‌ రాడార్‌. అలాగే.. 12 అలా్ట్రసానిక్‌ సెన్సర్లు, 12 కెమెరాలు ఉంటాయి. 

Updated Date - 2022-07-22T08:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising