ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి 80-90 సీట్లు!

ABN, First Publish Date - 2022-06-08T08:37:47+05:30

తెలంగాణ ప్రజానీకం బీజేపీ వైపు చూస్తోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీకి 80 నుంచి 90 సీట్లు వస్తాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ చూపు కమలం వైపు..

వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే

జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు, నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజానీకం బీజేపీ వైపు చూస్తోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీకి 80 నుంచి 90 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లు, నగరానికి చెందిన ఇతర నేతలతో సమావేశమైన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పిన వివరాల ప్రకారం.. దాదాపు 45 నిమిషాలపాటు ప్రధాని సంభాషించారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ దశలో మరింత కష్టపడితే సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పారు.


కార్పొరేటర్లకు రాజకీయ జీవితం ఇప్పుడే ఆరంభమైందని, కష్టపడితే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని, వచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకుంటూ వారికి చేరువ కావాలని సూచించారు. ఎదుగుతున్న క్రమంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా మీడియాతో జాగ్రత్తగా మాట్లాడాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధానితో కార్పొరేటర్లు గ్రూప్‌ ఫొటో దిగారు. 


హైదరాబాద్‌లో స్వాగతం సాధ్యం కాకపోవడంతో..

ప్రధాని మోదీ.. మే 26న హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల నుంచి ఐఎ్‌సబీ వద్ద స్వాగతం అందుకోవాలని నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా అది సాధ్యం కాకపోవడంతో వారిని ఢిల్లీలో కలిసేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. తొలుత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతో్‌షను కలిశారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డి నివాసంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో భేటీ అయ్యారు. కాసేపటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రావడంతో ఆయనతో కలిసి నేతలంతా బస్సుల్లో ప్రధాని అధికారిక నివాసమైన 7, లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌కు వెళ్లారు. సమావేశంలో కిషన్‌రెడ్డి, సంజయ్‌తోపాటు ముఖ్య నేతలు కె.లక్ష్మణ్‌, చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్‌, ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, రాంచందర్‌రావు, మురళీధర్‌రావు, స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని, కానీ.. ప్రధాని మోదీ కార్పొరేటర్లు కూడా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ విషయంలో ప్రధానిని చూసి సీఎం కేసీఆర్‌ బుద్ది తెచ్చుకోవాలన్నారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ... ప్రధానిని కలవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది తమకు మరిచిపోలేని రోజు అని చెప్పారు. 


వారసత్వ దుష్పరిపాలనకు ముగింపు: మోదీ ట్విట్‌

 తెలంగాణలో వారసత్వ దుష్పరిపాలనకు ముగింపు పలకడానికి, రాష్ట్రంలో సుపరిపాలన కోసం బీజేపీ పనిచేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో భేటీ ముగిసిన తర్వాత ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజా సేవలపై ఎలా దృష్టిసారించాలన్నదానిపై, క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయం అందించడంపై  చర్చించామన్నారు. 

Updated Date - 2022-06-08T08:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising