ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా పండుగ కోసం 8 ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2022-09-30T08:56:54+05:30

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబరు 30న సికింద్రాబాద్‌ నుంచి సంత్రాగచికి(భువనేశ్వర్‌-కటక్‌ మీదుగా)ప్రత్యేక రైలు(07645), అక్టోబరు 1న సంత్రాగచి నుంచి సికింద్రాబాద్‌కు(07646), అక్టోబరు 2న సికింద్రాబాద్‌-షాలిమార్‌ రైలు (07741), అక్టోబరు 3న షాలిమార్‌-సికింద్రాబాద్‌ రైలు(07742), అక్టోబరు 1, 8 తేదీల్లో నాందేడ్‌- బర్హంపూర్‌ రైలు (07431), త్రివేండ్రం-టాటానగర్‌ రైలు(06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్‌- నాందేడ్‌ ప్రత్యేక రైలు( 07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటానగర్‌-త్రివేండ్రం ప్రత్యేక రైలు (06191) నడుస్తుందని అధికారులు తెలిపారు.


1 నుంచి కొన్ని రైళ్ల సమయంలో మార్పు..

అక్టోబరు 1 నుంచి కొన్ని రైళ్లు బయలుదేరే సమయం, ఆయా స్టేషన్లకు చేరుకునే సమయాన్ని సవరించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు వారు వెళ్లాల్సిన రైళ్ల సమయం మార్పు సమాచారాన్ని రైల్వే విచారణ నంబర్‌. 139 ద్వారా కానీ, నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌(ఎన్‌టీఈఎ్‌స) వెబ్‌సైట్‌ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా రైల్వే స్టేషన్లలోని విచారణ కౌంటర్లలో తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 

Updated Date - 2022-09-30T08:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising