ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

56 ఏళ్ల మహిళకు 47 కిలోల అండాశయ కణితి

ABN, First Publish Date - 2022-02-16T08:03:30+05:30

ఓ 56 ఏళ్ల మహిళ అండాశయంలో ఉన్న 47 కిలోల భారీ కణితిని అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సర్జరీ చేసి తొలగించిన అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు
  • మన దేశంలో అతి పెద్ద అండాశయ కణితి ఇదేనని ప్రకటన


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):  ఓ 56 ఏళ్ల మహిళ అండాశయంలో ఉన్న 47 కిలోల భారీ కణితిని అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు తొలగించారు. భారతదేశంలో తొలగించిన అతి పెద్ద అండాశయ కణితి ఇదేనని వెల్లడించారు. ఈ కణితి వల్ల 18 ఏళ్లుగా బాధపడుతున్న ఆ మహిళ ఇటీవల మంచానికి పరిమితమైంది. ఆమె శరీర బరువు కూడా అసాధారణ స్థాయికి చేరింది. అయితే, జనవరి 27న ఎనిమిది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించి ఆ కణితితోపాటు కడుపులోని గోడ కణజాలం, 7కిలోల బరువున్న అదనపు చర్మాన్ని తొలగించింది. దీంతో ఆమె శరీర బరువు 49 కిలోలకు తగ్గిపోయింది. అప్పట్నించి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆ మహిళను సోమవారం(ఫిబ్రవరి 14)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 

Updated Date - 2022-02-16T08:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising