41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశాం
ABN, First Publish Date - 2022-12-16T03:40:45+05:30
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ టీంకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని కాంగ్రెస్
కాంగ్రెస్ వార్‌రూం ఉద్యోగుల అరె్‌స్టపై హైకోర్టులో ప్రభుత్వం
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ టీంకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్‌రూంలో ఉన్న ఉద్యోగులను సైబర్ క్రైం పోలీసులు తీసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తమ ఉద్యోగులు ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మండ ప్రతా్‌పలను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారని పిటిషనర్, కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పోలీసులు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ వాదనలు వినిపిస్తూ అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో నిందితులను ప్రశ్నించడం కోసం ముందుగా వారికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆ తర్వాత వదిలేశామని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రజినీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తమ ఉద్యోగులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి 18 గంటలపాటు కస్టడీలో ఉంచారని తెలిపారు. అక్రమంగా కస్టడీలో ఉంచినందుకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం పోలీసులు నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చినందున పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, సునీల్ బృందానికి చెందిన ముగ్గురు ఉద్యోగులకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుంటూ ‘తెలంగాణ గళం’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ బృందం చర్యలపై గత నెల 24న తుకారంగేట్‌కు చెందిన ఆర్.సామ్రాట్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలి కేసు నమోదైందని వివరించారు. మరికొన్ని ఠాణాల్లోనూ ఇలాంటి కేసులు నమోదైనా.. తుకారంగేట్ కేసులో సీఆర్పీసీ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 10.30 తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు భవిష్యత్‌లో ఎలాంటి నేరం చేయకూడదని, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని సూచించారు.
Updated Date - 2022-12-16T03:40:46+05:30 IST