ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగ తర్వాత 32 వేల కేసులు

ABN, First Publish Date - 2022-01-25T07:06:07+05:30

రాష్ట్రంలో సంక్రాంతి అనంతరం భారీగా కొవిడ్‌ కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రోజుకు సగటున 3,521 కేసుల నమోదు
  • రాష్ట్రంలో కొత్తగా 3,980 మందికి కొవిడ్‌ పాజిటివ్‌


 

హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్రాంతి అనంతరం భారీగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. పండుగ తర్వాత 9 రోజుల్లో ఏకంగా 31,960 పాజిటివ్‌లు వచ్చాయి. అంటే.. రోజుకు సగటున 3521 కేసులు రికార్డయ్యాయి. ఇక సంక్రాంతికి ముందు 9 రోజుల్లో 17,123 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 1,902 పాజిటివ్‌లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే పండుగ వెళ్లాక.. పాజిటివ్‌లు దాదాపు రెట్టింపు అయ్యాయి.


మరోవైపు సోమవారం రాష్ట్రంలో 97,113 మందికి టెస్టులు చేశారు. 3,980 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు చనిపోయారు. కొత్తగా 2,398 మంది కోలుకున్నారు. ఇంకా 33,673 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌లలో హైదరాబా ద్‌లో 1,439, మేడ్చల్‌లో 344, రంగారెడ్డిలో 234, హనుమకొండలో 159, ఖమ్మంలో 110 నమోదయ్యాయి. సోమవారం 2.57 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 1.91 లక్షల మందికి రెండో, 11,505 మంది ముందుజాగ్రత్త డోసు పొందారు. 15-18 ఏళ్ల వయసు వారిలో ఇప్పటివరకు 11.10 లక్షల మంది టీకా తీసుకున్నారు.


Updated Date - 2022-01-25T07:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising