ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘317’ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తా

ABN, First Publish Date - 2022-01-25T07:18:35+05:30

రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉన్న 317 జీవోను రద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉపాధ్యాయ సంఘాల నేతలతో రేవంత్‌రెడ్డి 


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉన్న 317 జీవోను రద్దు చేయాలన్న డిమాండ్‌ను తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఈ జీవో రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే పోరాటానికి కాంగ్రెస్‌ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.


సోమవారం రేవంత్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు.. 317 జీవోను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 5న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహాధర్నాలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు తలపెట్టిన ధర్నాలకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. 317జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉన్న సంగతిని తాను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. రేవంత్‌ను కలిసిన వారిలో  సంఘాల నేతలు హర్షవర్థన్‌రెడ్డి, పోచయ్య, రవిశంకర్‌రెడ్డి, మైకా శ్రీనివాస్‌ ఉన్నారు. 


Updated Date - 2022-01-25T07:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising