ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 రాత్రి బాపూ ఏం చేశారు?

ABN, First Publish Date - 2022-08-15T10:14:41+05:30

ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 11 గంటలకు రాట్నంపై ఖద్దరు వడికి బాపూజీ నిద్రపోయారు. 12 గంటలకు స్వతంత్ర భారతం ఆవిర్భవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గస్టు 14వ తేదీ అర్ధరాత్రి 11 గంటలకు రాట్నంపై ఖద్దరు వడికి బాపూజీ నిద్రపోయారు. 12 గంటలకు స్వతంత్ర భారతం ఆవిర్భవించింది. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఘనంగా జరిగిన వేడుకలో నెహ్రూ సారథ్యంలో ప్రభుత్వం కొలువు దీరింది. నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం (ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ) చేశారు. దేశమంతటా ఊరూ వాడా పెద్దఎత్తున వేడుకలు జరిగాయి. అయితే గాంధీజీ వీటన్నిటికీ దూరంగా ఉన్నారు. 15వ తేదీ వేకువజామున 3.45 గంటలకు లేచారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆయన మాత్రం వేడుక జరుపుకోలేదు. బెంగాల్‌ కేబినెట్‌ సభ్యులకు ఓ సందేశం పంపారు. ‘ఈ రోజు నుంచి మీరు ముళ్ల కిరీటం ధరించాల్సి ఉంటుంది. సత్యం, అహింసల కోసం అహర్నిశలూ శ్రమించండి. అధికారంతో జాగ్రత్త. అది మిమ్మల్ని అవినీతిపరులను చేస్తుంది. మీరు భారతీయ గ్రామాల్లోని పేదలకు సేవ చేయడానికే పదవులు చేపట్టారని గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు. ఆ సాయంత్రం ప్రార్థనా సమావేశం జరిగింది. హిందూ ముస్లిములంతా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జయజయ ధ్వానాలు చేశారు. హిందువులను మసీదుల్లోకి.. ముస్లింలను ఆలయాల్లోకి ఆహ్వానించారు. ఈ సామరస్యం కలకాలం కొనసాగాలని గాంధీజీ ఆకాంక్షించారు.

Updated Date - 2022-08-15T10:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising