1300 కిలోల గంజాయి స్వాధీనం
ABN, First Publish Date - 2022-10-07T08:08:32+05:30
రూ.2.8 కోట్లు విలువ చేసే 1300 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
- దోొరికిన పరుకు విలువ రూ.28 కోట్లు
- అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు అరెస్టు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రూ.2.8 కోట్లు విలువ చేసే 1300 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఆ గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం విలేకరులకు వివరించారు. పెద్దఅంబర్‌పేట్ జేసీబీ జంక్షన్ వద్ద బుధవారం తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ డీసీఎం వ్యానులో గంజాయిని గుర్తించారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి అందులోని సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ఉన్న నరేంద్ర హరిజన్ (29)తోపాటు వాహన డ్రైవర్ చంద్రేశ్ సాకేత్ (32)ని అరెస్టు చేశా రు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ వాసులే. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజేశ్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ నెల2న రాయపూర్ నుంచి డీసీఎంలో బయలుదేరిన నరేంద్ర, సాకేత్ మూడో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గంపేటకు చేరుకున్నారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా మారేడ్‌మల్లికి చెందిన పెంటారావు అలియాస్ బాపూజీని కలిశా రు. వారిని ఓ దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన పెంటారావు డీసీఎంలో 40 సంచుల గంజాయిని లోడు చేశాడు. ఆ లోడ్‌తో మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ చౌరస్తాకు బయలుదేరిన నరేంద్ర, సాకేత్ పోలీసులకు చిక్కారు. రాజేశ్ కుమార్, పెంటారావు కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2022-10-07T08:08:32+05:30 IST