ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిత నిధికి 1% విరాళం

ABN, First Publish Date - 2022-04-05T08:58:59+05:30

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకుగాను ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరిత నిధి’కి నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏప్రిల్‌ 1 నుంచే అమలు 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకుగాను ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరిత నిధి’కి నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు లైసెన్సులను జారీ చేసేటప్పుడు, పాత పరిశ్రమల లైసెన్సులను రె న్యూవల్‌ సమయంలో వార్షిక ఫీజులో ఒక శాతం హరిత నిధికి విరాళంగా చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక శాతం నిధుల చెల్లింపు విధానం ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ కార్మిక ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాణి కౌముది ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హరిత నిధి బ్యాంకు ఖాతా నంబరు 40692056081, ఐఎ ఫ్‌ఎస్సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 0020077, ఎంఐసీఆర్‌ కోడ్‌ 500002354ను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలు, విద్యార్థుల ఫీజుల నుంచి హరిత నిధికి నిధులు సేకరిస్తోంది. తాజాగా రెన్యూవల్‌ సమయంలో రూ.1,000 విరాళంగా సేకరిస్తోంది.

Updated Date - 2022-04-05T08:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising