బడ్జెట్ ధరలోనే వైర్లెస్ ఇయర్ ఫోన్స్
ABN, First Publish Date - 2022-08-20T05:54:17+05:30
ఇయర్ ఫోన్‌ను ఉపయోగించడం నేడు సర్వసాధారణం. ట్రూ వైర్లెస్ స్టీరియో(టీడబ్ల్యుఎస్) ఇయర్ ఫోన్స్ అందునా రూ.5000కు లోపే లభిస్తున్నాయి.
ఇయర్ ఫోన్‌ను ఉపయోగించడం నేడు సర్వసాధారణం. ట్రూ వైర్లెస్ స్టీరియో(టీడబ్ల్యుఎస్) ఇయర్ ఫోన్స్ అందునా రూ.5000కు లోపే లభిస్తున్నాయి. ఈ ఇయర్ ఫోన్లు ఇండియాలో చాలా పాపులర్. సౌకర్యవంతంగా ఉండటమే కాదు, మనిషి కదలికలను కూడా ఇవి ఇబ్బందిపెట్టవు. ఆటలాడే వ్యక్తులు, జిమ్‌కు వెళ్ళే వారు కూడా వీటిని చాలా సులువుగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయిదు ఇలా ఉన్నాయి.
ఒప్పో ఎన్కో డబ్ల్యు 51
యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్(ఏఎన్సీ)తో ఈ టీడబ్ల్యుఎస్ ఇయర్ ఫోన్ వస్తోంది. నిజానికిది అధిక వ్యయమయ్యే డివైస్‌లకు ఉండే ఫీచర్లు కలిగి ఉంది. దీనికి ఉండే బ్లూటూత్ 5.0 అంటే సౌండ్‌లో ఆలస్యాన్ని కనీస స్థాయిని తగ్గిస్తుంది. వేరింగ్ డిటెక్షన్ ఉన్నందున ఆన్, ఆఫ్ ఆందోళన ఉండదు. 15 నిమిషాల చార్జింగ్‌తో తొమ్మిది గంటల ప్లేటైమ్ లభిస్తుంది. వైర్లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు సంబంధించి ఐపీ54 రేటింగ్ ఉంది. వర్కౌట్ సెషన్స్‌కు తోడు బయట కార్యకలాపాలు ఎక్కువగా ఉండే వ్యక్తులకు ఇది మంచి చాయిస్. దీని రేటు రూ.4,990.
జేబీఎల్ ట్యూన్ 130ఎన్సీ
ఏఎన్‌సీకి తోడు యాంబియెంట్ అవేర్ పేరిట మరో ఫీచర్ దీనికి ఉంది. పరిసరాలను అనుసరించి వ్యక్తిగత ఇష్టం ప్రకారం ట్యూన్‌ని వెనక్కు తెచ్చుకునే సౌలభ్యం దీంతో సమకూరుతుంది. ఇయర్ ఫోన్స్ తొలగించకుండానే వేగంగా మాట్లాడి, చాట్‌ను ముగించవచ్చు. పది గంటల సేపు ప్లేటైమ్, బిల్ట్ఇన్ అలెక్సా, బ్లూటూత్ 5.2కు అవకాశం ఉన్న ఈ ఇయర్ ఫోన్ ధర రూ.4,699.
బోట్ ఎయిర్‌డోప్స్ 511వీ2
ఐపీఎక్స్ 4 రేటింగ్, ఐడబ్ల్యుపీ టెక్నాలజీతో ఇది వస్తోంది. 4 మైక్రోఫోన్ సపోర్ట్, బ్లూటూత్ 5.0, ప్లే/పాజ్ కోసం మల్టీఫంక్షన్ బటన్, వాయిస్ అసిస్టెంట్, ఆరుగంటల సేపు ప్లేటైమ్ ఉన్నాయి. దీని ధర రూ.2,499 కాగా రేటుకు తగిన ఇయర్ ఫోన్ ఇది.
స్కల్కేండీ డైమ్
ఆడియో సెగ్మంట్లో దీనికి మంచి పేరుంది. 12 గంటల బ్యాటరీ లైఫ్, మైక్రోఫోన్ - కాల్ - ట్రాక్ - వాల్యూవ్ - నాయిస్ ఐసోలేషన్‌కు కంట్రోల్స్, ఐపీఎక్స్4 రేటింగ్ దీనికి ఉన్నాయి. దీని రేటు రూ.2.649.
నాయిస్ బడ్స్ ప్లే వీ2
క్వాడ్ మైక్రోఫోన్ దీనికి ఉంది. దాంతో మంచి ఆడియో అనుభవం లభిస్తుంది. గూగుల్ ఫాస్ పెయిర్‌తో ఆండ్రాయిడ్ 6.0, ఓఎస్ డివైసెస్తో పెయిర్ కాగలిగే సదుపాయం ఉంది. సింగిల్ చార్జ్‌తో అయిదు గంటల సేపు ప్లేటైమ్ లభిస్తుంది. దీని రేటు రూ.3,498.
Updated Date - 2022-08-20T05:54:17+05:30 IST