ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నాప్‌చాట్‌లో గేమ్‌ల వరద

ABN, First Publish Date - 2022-01-08T05:30:00+05:30

స్నాప్‌చాట్‌లో గేమ్‌ల వెల్లువ మొదలైంది. రెండేళ్ళ క్రితమే స్నాప్‌చాట్‌లో గేమ్స్‌ ఆరంభమయ్యాయి. మొదట్లో ఆరు గేమ్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 50కి పెరిగింది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్నాప్‌చాట్‌లో గేమ్‌ల వెల్లువ మొదలైంది. రెండేళ్ళ క్రితమే స్నాప్‌చాట్‌లో  గేమ్స్‌ ఆరంభమయ్యాయి. మొదట్లో ఆరు గేమ్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 50కి పెరిగింది. మూడో పార్టీ గేమ్‌లకు ఇందులో అవకాశం లేదు. స్నాప్‌చాట్‌ గేమ్‌లు మాత్రమే ఇందులో అందుబాటులో ఉంటాయి. మిత్రులతో కలిసి వీటిని ఆడుకోవచ్చు. లేదంటే ఒంటరిగానూ ఆడేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ గేమ్స్‌ అన్ని డివైస్‌ల్లో లభ్యం కావు. అలాగే డివైస్‌, నెట్‌వర్కింగ్‌ను బట్టి కూడా గేమ్‌ అనుభవం ఉంటుంది. స్నాప్‌చాట్‌లో గేమ్‌ ఆడుకోవాలంటే...


 ఐఓఎస్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో స్నాప్‌చాట్‌ ఓపెన్‌ చేయాలి.

 చాట్‌ సెక్షన్‌ను విజిట్‌ చేసేందుకు కెమెరా కుడిపక్క స్వైప్‌ చేయాలి.

గ్రూప్‌ లేదంటే ఇండివిడ్యుయల్‌ చాట్‌ను ఓపెన్‌ చేయండి.

 స్ర్కీన్‌ అడుగున రైట్‌ కార్నర్‌లో రాకెట్‌ ఐకాన్‌ను టాప్‌ చేస్తే గేమ్స్‌ అండ్‌ మినీస్‌ డ్రాయిర్‌ ఓపెన్‌ అవుతుంది.

 ఇప్పుడు ఆడాలనుకున్న గేమ్‌ని టాప్‌ చేసుకోవాలి. 

ఒంటరిగా ఆడుకోవాలంటే

 స్నాప్‌చాట్‌ ఓపెన్‌ చేసుకోవాలి.

 స్ర్కీన్‌ టాప్‌లో ఉన్న మేగ్నఫైయింగ్‌ లోగోతో కలిపి సెర్చ్‌ ఐకాన్‌ని టాప్‌ చేయాలి. 

 అప్పుడు ఒక న్యూ విండోను చూడగలుగుతారు. బెస్ట్‌ ఫ్రెండ్స్‌, రీసెంట్స్‌, క్విక్‌ యాడ్‌ తదితరాలు అక్కడ ఉంటాయి. అదే విండోలో గేమ్స్‌ అండ్‌ మినీస్‌ సెక్షన్‌ కూడా కనిపిస్తుంది. 

 ఆడాలని అనుకుంటున్న గేమ్‌ని టాప్‌ చేస్తే సరిపోతుంది.

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising