ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నాప్‌చాట్‌ టీన్స్‌కు సెక్యూరిటీ ఫీచర్స్‌

ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30

సామాజిక మాధ్యమాల్లో టీన్స్‌ మోసపోకుండా ఉండేందుకు ‘స్నాప్‌చాట్‌’ నడుంబిగించింది. వారిని ఉద్దేశించి సెక్యూరిటీ ఫీచర్స్‌ను విడుదల చేసింది. ఫీచర్‌ ‘క్విక్‌ యాడ్‌’ ప్రధానంగా 13-17 మధ్య వయస్కులను రక్షించేందుకు ఉద్దేశించినది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాజిక మాధ్యమాల్లో టీన్స్‌ మోసపోకుండా ఉండేందుకు ‘స్నాప్‌చాట్‌’ నడుంబిగించింది. వారిని ఉద్దేశించి సెక్యూరిటీ ఫీచర్స్‌ను విడుదల చేసింది. ఫీచర్‌ ‘క్విక్‌ యాడ్‌’ ప్రధానంగా 13-17 మధ్య వయస్కులను రక్షించేందుకు ఉద్దేశించినది. తమకు తాము పరస్పరం స్నేహం చేసినవారికి తప్ప స్నాప్‌చాట్‌ నుంచి ఆ వయస్కులకు ఫ్రెండ్‌ సజెషన్స్‌ ఉండవు. సాధారణ జీవితంలోనూ ఫ్రెండ్‌గా ఉన్న వ్యక్తిని మాత్రమే కలుపుకొనే అవకాశం ఇస్తున్నామని, తద్వారా పిల్లల పరిరక్షణ కోసం తాము మరింత శ్రద్ధ వహిస్తున్నామని ఒక బ్లాగ్‌పోస్టులో స్నాప్‌చాట్‌ తెలియజేసింది.  రెండోది, డ్రగ్స్‌ విషయంలో విమర్శలను ఎదుర్కొంటున్న స్నాప్‌చాట్‌ కొత్త అప్‌గ్రెడేషన్‌తో దానిపైనా కంట్రోల్‌ ఉంచుతోంది. అల్గోరిథమ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ను ఇందుకు ఉపయోగిస్తోంది. కమ్యూనిటీ యాంటీ డ్రగ్‌ కొయిలేషన్స్‌ ఆఫ్‌ అమెరికా అలాగే ట్రూత్‌ ఇనీషియేటివ్‌తో కలిసి కూడా పనిచేస్తోంది.  


‘మేజిక్‌ ట్రిక్‌’

సహజమైన అందానికి సొబగులు జతచేసుకోవడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకోవడం నేడు ఫ్యాషన్‌.  ఫొటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ అందుకు అనుగుణంగానే, ఎఆర్‌ లెన్స్‌తో ‘మేజిక్‌ ట్రిక్‌’కు అవకాశం కల్పిస్తోంది. ‘లేస్‌ వేఫర్‌ స్టయిల్‌’ - మరింత వివరంగా చెప్పుకోవాలంటే ఈ సదుపాయంతో వ్యక్తులు పొగ చాటున అదృశ్యం కావచ్చు.  ఒకప్పటి పౌరాణిక సినిమాల్లో నారదుడు పద్యాలు పాడుకుంటూ మేఘాల్లో వస్తూ, మాయమైనట్టు అన్న మాట.  తమ కస్టమర్లకు  ఇది మంచి అనుభవాన్ని కలుగజేస్తుందన్న ఆశాభావాన్ని స్నాప్‌చాట్‌ వ్యక్తం చేస్తోంది. ఇటీవల కబడ్డీ ఆటకు ఎఆర్‌ లెన్స్‌ సౌలభ్యాన్ని స్నాప్‌చాట్‌ కలుగజేసింది. దీని కోసం స్టార్‌ స్పోర్ట్స్‌తో జతకట్టింది. దీన్ని ఉపయోగించి  ఏడుగురు ఆటగాళ్ళ మధ్యకు కూతకు వెళ్ళిన  ప్లేయర్‌ ముఖానికి బదులు తన ఫేస్‌ జోడించుకోవచ్చు. గత ఏడాది స్టోరీ స్టూడియో పేరిట క్రియేటర్లకు ఎడిటింగ్‌ యాప్‌ను విడుదల చేసింది. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising