ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిపీటెడ్‌ డేటాకు ఇలా చెల్లుచీటీ

ABN, First Publish Date - 2022-08-13T05:30:00+05:30

పెద్ద ఎత్తున డేటాతో గూగుల్‌ షీట్స్‌లో పనిచేస్తున్నప్పుడు రిపీట్‌ అవడం సర్వసాధారణం. అయితే ఇలా రిపీట్‌ అయినప్పుడు విశ్లేషణ తదితర కార్యకలాపాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద ఎత్తున డేటాతో గూగుల్‌ షీట్స్‌లో పనిచేస్తున్నప్పుడు రిపీట్‌ అవడం సర్వసాధారణం. అయితే ఇలా రిపీట్‌ అయినప్పుడు విశ్లేషణ తదితర కార్యకలాపాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది చూసినప్పుడు రిపీట్‌ అయితే అప్లయ్‌ చేసిన వారి సంఖ్యను కరెక్ట్‌గా తెలుసుకోవడం కష్టం. దీన్ని నివారించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. 


మొదటి పద్ధతి

  • గూగుల్‌ స్ర్పెడ్‌ షీట్‌ ఓపెన్‌ చేయాలి.
  • డూప్లికేట్స్‌ తొలగించాలని అనుకుంటున్న కాలమ్స్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • టాప్‌లో ఉండే డేటా ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. 
  • డేటా క్లీన్‌పని సెలెక్ట్‌ చేయాలి. రిమూవ్‌ డూప్లికేట్స్‌పై క్లిక్‌ చేయాలి. ఆ ఆప్షన్‌ డ్రాప్‌-డౌన్‌ మెనూలో ఉంటుంది. 
  • డేటా హేజ్‌ హెడర్‌ రో కి పక్కన ఉన్న బాక్స్‌ని టిక్‌ చేయాలి. 
  • రిమూవ్‌ డూప్లికేట్స్‌ బటన్‌ని హిట్‌ చేయాలి. 


రెండో పద్ధతి

ఇది యూనిక్‌ ఫార్ములా. రిపీటెడ్‌ డేటా కనుగొనడం, తొలగింపులో వేర్వేరు పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి వరుసను కంపేర్‌ చేసుకుని, కనుగొన్న డేటా తొలగించడం కూడా ఉంటుంది.

  • గూగుల్‌ స్ర్పెడ్‌షీట్‌ను ఓపెన్‌ చేయాలి. ఎంప్టీ సెల్‌ని ఎంపిక చేసుకోవాలి.
  • ఫార్ములా = యూనిక్‌(ఏ2:డీ9)ని ఎంటర్‌ చేసి సెల్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ ఏ2:డీ9 అంటే సెలెక్ట్‌ చేసిన సెల్స్‌.
  • ఎంటర్‌ బటన్‌ని హిట్‌ చేయాలి. ఇప్పుడు డూప్లికేట్స్‌ లేకుండా ఇంకో టేబుల్‌ కనిపిస్తుంది. 

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising