ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2022 పాపులర్‌ గేమ్స్‌

ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30

కొంత మంది సెల్‌ వినియోగదారులకు మొబైల్‌ గేమ్స్‌ ఆడకుంటే పూట గడవదు. మరికొంత మందికి ఏమాత్రం ఖాళీ లభించినా సెల్‌లోని ఆటల్లో మునుగుతుంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంత మంది సెల్‌ వినియోగదారులకు మొబైల్‌ గేమ్స్‌ ఆడకుంటే పూట గడవదు. మరికొంత మందికి ఏమాత్రం ఖాళీ లభించినా సెల్‌లోని ఆటల్లో మునుగుతుంటారు. ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అన్న తారతమ్యాలు ఉండవు. ఔత్సాహికులు మార్కెట్‌లోకి ఎప్పుడు కొత్త గేమ్స్‌ రిలీజ్‌ అవుతాయా అని ఎదురు చూస్తుంటారు. ఉత్కంఠ కలిగించే ఈ ఆటలు అన్నం, నీళ్ళను కూడా మరిపిస్తుంటాయి.  


మైక్రోసాఫ్ట్‌, సోనీ వంటి పెద్ద కంపెనీలు ఎప్పటి మాదిరిగా ఈ ఏడాది కూడా సదరు ఆటగాళ్ళ అంచనాలు వమ్ముకాని విధంగా కొంగ్రొత్త మొబైల్‌ గేమ్స్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. గడిచిన  దశాబ్ది కాలంలో మైమరిపించిన వాటికి దీటైన గేమ్స్‌ ప్రత్యక్షం కానున్నట్టు సమాచారం. మొదట అవేంటో చూద్దాం



చోకోబో జీపీ

ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఈ గేమ్‌ విడుదల కానుంది. జపనీస్‌ రోల్‌ ప్లేయింగ్‌ గేమ్‌ సిరీస్‌గా పేరొందిన ‘ఫైనల్‌ ఫాంటసీ’ పరిచయం ఉన్న వ్యక్తులకు ఈ గేమ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. టైమ్‌-అటాక్‌ మోడ్‌తో వస్తోంది. దాంతో ఘోస్ట్‌ కార్లు ఉపయోగించి లాప్స్‌ను సరిచేసుకోవచ్చు. ‘నిన్‌టెండో స్విచ్‌’కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ గేమ్‌గా విడుదల కానుంది. 


వైర్డ్‌ వెస్ట్‌

పిఎస్‌4, ఎక్స్‌బాక్స్‌, పీసీ తదితర ప్లాట్‌ఫారాలపై మార్చి 31న ఈ గేమ్‌ విడుదల కానుందని సమాచారం. ఔత్సాహికులను ఇది అలరిస్తుందని కూడా చెబుతున్నారు. గ్రాఫిక్స్‌ను కూడా గణనీయంగా మెరుగుపరిచారు. దాంతో ఎక్కువ మంది ఆటగాళ్ళకు ఇది నచ్చుతుందని భావిస్తున్నారు. 



డయింగ్‌ లైట్‌ 2: స్టే హ్యూమన్‌

ఫిబ్రవరి 4న ఇది విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. నిన్‌టెండో స్విచ్‌, ఎక్స్‌బాక్స్‌, పీసీ, పీఎస్‌4 సహా వివిధ ప్లాట్‌ఫారాలపై ఇది ప్రత్యక్షం కానుంది. ఎంతోకాలంగా ఎదురు చేస్తున్న గేమ్‌ ఇది. ఇందులో కనిపించే భిన్న కేరక్టర్లతో బోలెడంత వినోదాన్ని పొందవచ్చు. 


ఎల్డన్‌ రింగ్‌

ఇది వచ్చే నెల 25న విడుదల కానుంది. వివిధ వేదికలపై ప్రత్యక్షం కానున్న ఈ గేమ్‌ని డార్క్‌ సోల్స్‌ క్రియేటర్లు సృష్టించారు. సింహాసనాల చుట్టూ కొనసాగే ఈ ఆట విజ్ఞానదాయకంగానూ ఉండనుంది. 


పోకేమన్‌ లెజెండ్స్‌: ఆర్సెస్‌

జనవరి నెలాఖరులోనే ఇది విడుదల కానుంది. పోకేమన్‌ సిరీస్‌లో సుదీర్ఘకాలం టెస్ట్‌ చేసిన తరవాత విడుదల చేస్తున్నారు. ఫీచర్స్‌కు సంబంధించి మాన్‌స్టర్‌ హంటర్స్‌తో పోలికలు ఉన్నాయి. ముందున్న వాటితో పోలిక అంతకుమించి ఈ గేమ్‌లోని దృశ్యాలు ఆటగాళ్ళను కట్టిపడేస్తాయని చెబుతున్నారు.

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising