ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు అమరవీరులను సమాజం ఎప్పటికీ గుర్తించుకుంటుంది

ABN, First Publish Date - 2022-10-26T23:27:35+05:30

విధి నిర్వహణలో అమరులైన పోలీసు వీరులను సమాజం ఎప్పటికీ గుర్తుకు ఉంచుకుంటుందని, వారి అడుగుజాడల్లో నడిచి, ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీ శ్వేత సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

సిద్దిపేట క్రైం, అక్టోబరు 26 : విధి నిర్వహణలో అమరులైన పోలీసు వీరులను సమాజం ఎప్పటికీ గుర్తుకు ఉంచుకుంటుందని, వారి అడుగుజాడల్లో నడిచి, ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీ శ్వేత సూచించారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ఫ్లాగ్‌ డే కార్యక్రమాల్లో భాగంగా సిద్దిపేట పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరంలో సీపీ, పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. రక్తదాన శిబిరంలో 186 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వాసుపత్రికి అందజేశారు. రక్తదానం చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ యువజన సంఘాలు, యువకులు, ప్రజా ప్రతినిధులను సీపీ అభినందించి, సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ తరఫున అప్రిసియేషన్‌ సర్టిఫికెట్లను అందజేశారు.

Updated Date - 2022-10-26T23:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising