ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీలాకర్‌లో పెన్షన్‌ సర్టిఫికెట్స్‌

ABN, First Publish Date - 2022-10-22T07:27:44+05:30

అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు ‘డీజీ లాకర్‌’కు మించిన యాప్‌ లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు ‘డీజీ లాకర్‌’కు మించిన యాప్‌ లేదు. తాజాగా దీనిని నుంచి పెన్షన్‌ సర్టిఫికెట్లను కూడా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించిన యాప్‌ నిజానికి క్లౌడ్‌ ఆధారిత సర్వీస్‌. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను దీన్లో సేవ్‌ చేసుకోవచ్చు. వాటి యాక్సెస్‌కూ అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్నే పెన్షన్‌ సర్టిఫికెట్లకూ వర్తింపజేశారు. వయసు మీరిన వ్యక్తులకు ఈ వెసులుబాటు బాగా ఉపయోగపడుతుంది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పెన్షన్‌ సర్టిఫికెట్లను జారీచేస్తుంది. డీజీలాకర్‌ నుంచి అవి పొందేందుకు...


వెబ్‌ లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోని డీజీలాకర్‌లో లాగిన్‌ కావాలి.

ఆధార్‌ నంబర్‌ లేదంటే రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నంబర్‌తోపాటు ఆరంకెల సెక్యూరిటీ పిన్‌తో సైన్‌-ఇన్‌ కావాలని అడుగుతుంది. ఆ వెంటనే ఓటీపీ నంబర్‌ డీజీలాకర్‌ యాక్సెస్‌ కోసం అందుతుంది. 

లాగిన్‌ కాగానే ‘బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పెన్షన్‌ సర్టిఫికెట్స్‌’ కోసం చూడాలి. వెబ్‌సైట్‌ లెఫ్ట్‌సైడ్‌ ఉండే ‘సెర్చ్‌ డాక్యుమెంట్స్‌’నైనా చూడాలి.

పెన్షన్‌ డాక్యుమెంట్‌ అని రాస్తే మల్టిపుల్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో నుంచి ‘బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పెన్షన్‌ సర్టిఫికెట్స్‌’ ని ఎంపిక చేసుకోవాలి.

అక్కడో ఫారమ్‌ ఉంటుంది. అందులో పెన్షనర్‌ పుట్టిన తేదీ, పీపీఓ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

పీపీఓ నంబర్‌ కింద వరుసలో ఉన్న చెక్‌మార్క్‌పై టాప్‌ చేయాలి. డాక్యుమెంట్స్‌ షేర్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు అవుతుంది. తదుపరి ‘గెట్‌ డాక్యుమెంట్‌’పై క్లిక్‌ చేస్తే చాలు, పెన్షన్‌ సర్టిఫికెట్‌ అందుతుంది. 

వాట్సాప్‌ నుంచి కూడా డీజీలాకర్‌ యాక్సెస్‌ పొందవచ్చు. మైగవ్‌వాట్సాప్‌ నంబర్‌ 9013151515కు హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి. డీజీలాకర్‌ సర్వీసెస్‌ను టాప్‌ చేసి, అక్కడ ఇచ్చిన సూచనలను పాటించి పెన్షన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. 

Updated Date - 2022-10-22T07:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising