ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెట్‌ఫ్లిక్స్‌ చైల్డ్‌ కంట్రోల్‌

ABN, First Publish Date - 2022-12-10T11:04:21+05:30

రెగ్యులర్‌ ప్రొఫైల్స్‌ పక్కనే ఇది ఉంటుంది. దీని సహాయంతో పేరెంట్స్‌ తమ పిల్లలు వేటిని చూడవచ్చో నియంత్రించవచ్చు. తమ పిల్లలు చూడకూడదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివిధ వయస్కులకు అవసరమైన కంటెంట్‌ అందిస్తూ ప్రజాదరణ పొందుతున్న ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఒకటి. సినిమాలు, గేమ్స్‌, టీవీ షోలు తదితరాలతో జనాలను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా పేరెంటల్‌ కంట్రోల్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ పరిచయం చేస్తోంది. ఈ కంట్రోల్స్‌ను పూర్తిగా ఉండే చైల్డ్‌ ప్రొఫైల్‌ ద్వారా అందిస్తోంది.

రెగ్యులర్‌ ప్రొఫైల్స్‌ పక్కనే ఇది ఉంటుంది. దీని సహాయంతో పేరెంట్స్‌ తమ పిల్లలు వేటిని చూడవచ్చో నియంత్రించవచ్చు. తమ పిల్లలు చూడకూడదు అనుకున్న వాటిని ఆపవచ్చు. ఒక రకంగా దీన్ని పిల్లలకు ఉపయోగించే లాకింగ్‌ సిస్టమ్‌ అనుకోవచ్చు. దీని కోసం నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఐడి, పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ కావాలి. ప్రొఫైల్‌ అండ్‌ పేరెంటల్‌ కంట్రోల్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్ళీ కిడ్స్‌ ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయాలి. వ్యూయింగ్‌ రిస్ట్రిక్షన్స్‌ని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ చెబుతుంది. పిల్లల పరిణత దశను అనుసరించి అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. పేర్లతో నియంత్రించవచ్చు. ఒకసారి అవన్నీ చేసిన తరవాత కింద ఉండే బటన్‌ని హిట్‌ చేసి సేవ్‌ చేయవచ్చు. తరవాత ప్రొఫైల్‌ సెలెక్షన్‌ పేజీలోకి వెళ్ళాలి. చైల్డ్‌ ప్రొఫైల్‌ని ఎంపిక చేసుకోవాలి. అప్లయ్‌ చేసిన ఆంక్షలు, మార్పులను చెక్‌ చేసుకోవాలి. ఏవైనా మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. తద్వారా అవసరం లేని కంటెంట్‌ పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవచ్చు.

Updated Date - 2022-12-10T11:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising