ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. iPhone 13 కంటే తక్కువ ధరకే iPhone 14!

ABN, First Publish Date - 2022-12-02T11:05:47+05:30

Flipkart గుడ్‌న్యూస్ చెప్పింది. iPhone 14పై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. iPhone 13 కంటే తక్కువ ధరకే iPhone 14ను సొంతం చేసుకునే అవకాశం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్స్.. మార్కెట్‌లో ఈ మొబైల్స్‌కు ఉన్న క్రేజే వేరు. అందుకే చాలా మంది ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే భారత్‌లో లాంచ్ అయిన iPhone 14ను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడ్డారు. కానీ దాని ధర చూసి అంత వెచ్చించలేక వెనక్కి తగ్గారు. అలాంటి వారికి Flipkart గుడ్‌న్యూస్ చెప్పింది. iPhone 14పై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. iPhone 13 కంటే తక్కువ ధరకే iPhone 14ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. అది ఎలా అంటారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

128 జీబీ స్టోరేజీ వేరియంట్ iPhone 14 ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో రూ.77,400గా ఉంది. కానీ ఈ ఫోన్‌ను కేవలం రూ.48వేలకే సొంతం చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్‌పై ఏకంగా రూ.5000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. అలాగే పాత ఫోన్లపై రూ.20,500 వరకు ఎక్స్జేంజ్ వ్యాల్యూ ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్‌పై రూ.3000 వరకు అదనంగా ఎక్స్జేంజ్ వ్యాల్యూ‌ను అందిస్తోంది. ఇలా వీటన్నిటితో కలిపి దాదాపు రూ.48వేలకే iPhone 14ను సొంతం చేసుకునే అవకాశాన్ని Flipkart కల్పించింది. కాగా.. ఫ్లిప్‌కార్టులో iPhone 13 ప్రస్తుత ధర రూ.65,999గా ఉంది.

ఇక ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లను ఒకసారి పరిశీలిస్తే.. ఐఫోన్ 14లో 6.1అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే‌ను ఉపయోగించారు. ఇది A15 బయోనిక్ చిప్‌సెట్‌ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్ కెపాసిటీతో ఇది ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

Updated Date - 2022-12-02T11:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising