ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో రీమిక్సింగ్‌కు ఓకే

ABN, First Publish Date - 2022-01-29T05:30:00+05:30

పబ్లిక్‌, ప్రైవేటు అన్న సంబంధం లేకుండా వీడియోల రీమిక్సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ అవకాశం కలిగిస్తోంది. అంతేకాదు అందులో ఆ యూజర్‌ యాడ్‌ అయ్యేలా కూడా చేసుకుని ప్రొఫైల్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పబ్లిక్‌, ప్రైవేటు అన్న సంబంధం లేకుండా వీడియోల రీమిక్సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ అవకాశం కలిగిస్తోంది. అంతేకాదు అందులో ఆ యూజర్‌ యాడ్‌ అయ్యేలా కూడా చేసుకుని ప్రొఫైల్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ఇలా చేసేందుకు మొదట ఇన్‌స్టాగ్రామ్‌పై ఉన్న ఏ వీడియోను రీమిక్స్‌ చేయాలనుకుంటున్నారో యూజర్‌ ఎంపిక చేసుకోవాలి. తదుపరి రీల్స్‌ను హిట్‌ చేయాలి. ఎలిజిబుల్‌ రీల్‌ తాలూకా రైట్‌ కార్నర్‌ అడుగున మూడు చుక్కల ఐకాన్‌ని టాప్‌ చేయాలి. ‘రీమిక్స్‌ దిస్‌ రీల్‌’ అన్న ఆప్షన్‌ కనిపిస్తుంది. 


 అదేవిధంగా ప్లాట్‌ఫారంపై వీడియో అయిన పక్షంలో హారిజాంటల్‌ మూడు చుక్కల ఐకాన్‌ పోస్టు అప్పర్‌ రైట్‌ కార్నర్‌లో కనిపిస్తుంది. టాప్‌ చేస్తే ‘రీమిక్స్‌ ద వీడియో’ మధ్యలో దర్శనమిస్తుంది. 

 రీమిక్స్‌ వీడియో/రీల్‌ ఆప్షన్‌ టాప్‌ చేస్తే కెమెరా ఆన్‌ అవుతుంది. 

 రీమిక్స్‌ చేయాలని అనుకుంటున్న ఒరిజినల్‌ వీడియో స్ర్కీన్‌పై ప్రత్యక్షమవుతుంది. రీల్‌లోనూ ఆడియోను మార్చవచ్చు. అప్పుడు వాల్యూమ్‌ అప్‌ లేదా డౌన్‌కు టర్న్‌ చేయవచ్చు. వాయిస్‌ ఓవర్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. 


ఇండియాలోనూ సబ్‌స్ర్కిప్షన్‌ ఫీచర్‌


ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల సబ్‌స్ర్కిప్షన్‌ ఫీచర్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఇది అమెరికాలో టెస్టింగ్‌ దశలో ఉంది. ఎంపిక చేసిన ఒక పదిమంది వ్యక్తులకు ఈ ఫీచర్‌ సదుపాయాన్ని కల్పించారు. సదరు వ్యక్తులను ఫాలో కావాలంటే కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.  కొంత మొత్తం చెల్లించి ఫాలోవర్స్‌గా ఉండాల్సి ఉంటుంది. కొంత ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ వీరికి అందుబాటులో ఉంటుంది.


అయితే సల్మాన్‌ మెనన్‌ అనే భారత ట్విట్టర్‌ యూజర్‌కి ఇన్‌స్టాకి సంబంధించిన ఈ ఫీచర్‌ ప్రైస్‌తో సహా కనిపించింది. సబ్‌స్ర్కిప్షన్‌ ధర నెలకు 89 రూపాయలు, 440 రూపాయలు, 890 రూపాయలుగా ఈ ఆఫర్‌ కనిపించినట్లు పేర్కొన్నారు. ఏ ధర చెల్లిస్తే అందులో ఉన్న కంటెంట్‌ మాత్రమే కనిపిస్తుంది. యూస్‌ సబ్‌స్ర్కిప్షన్‌లో తొమ్మిది డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ధర ఉంది.

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising