ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియన్‌ మార్కెట్‌లోకి ఇన్ఫినిక్స్‌ హాట్‌ ప్రొ 12

ABN, First Publish Date - 2022-08-06T06:01:17+05:30

ఇన్ఫినిక్స్‌ హాట్‌ ప్రొ 12 మన దేశంలో విడుదలైంది. చైనాకు చెందిన ట్రాన్సిన్‌ గ్రూప్‌నకు చెందిన బ్రాండ్‌ ఇది. వాటర్‌డ్రాప్‌ స్టయిల్‌ నాచ్‌ డిస్‌ప్లేకు తోడు 90హెచ్‌జడ్‌ రిఫ్రష్‌ రేట్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్ఫినిక్స్‌ హాట్‌ ప్రొ 12 మన దేశంలో విడుదలైంది. చైనాకు చెందిన ట్రాన్సిన్‌ గ్రూప్‌నకు చెందిన బ్రాండ్‌ ఇది. వాటర్‌డ్రాప్‌ స్టయిల్‌ నాచ్‌ డిస్‌ప్లేకు తోడు 90హెచ్‌జడ్‌ రిఫ్రష్‌ రేట్‌. 180హెచ్‌జెడ్‌ శాంప్లింగ్‌ రేటు కలిగి ఉంది. యూనిసాక్‌ 16 ఎస్‌ఓసీ పవర్‌తోపాటు 8జీబీ ర్యామ్‌ ఉంది. గరిష్ఠంగా ఆన్‌బోర్డ్‌ స్టోరేజీ 128జీబీ. ఉపయోగించుకోని ఇన్‌ బిల్ట్‌ స్టోరేజీని అనుసరించి 5జీబీ మేర పెంచుకోవచ్చు. వెనుక డ్యూయల్‌ కెమెరా - 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ సెన్సర్‌తో ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.


18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది. 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ  వేరియంట్‌తో సెట్‌ ధర రూ.10,999. అదే 8జీబీ ర్యామ్‌, 128 స్టోరేజీతో రూ.12,999. ఆరంభ ధరగా టాప్‌-ఎండ్‌ మోడల్‌ ధరను రూ.11,999గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్‌ ఎంతకాలం ఉంటుందన్నది మాత్రం తెలియదు. ఎలక్ట్రిక్‌ బ్లూ, లైట్‌సాబర్‌ రంగుల్లో  లభ్యమవుతోంది. ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో అమ్మకాలు ఆరంభం కానున్నాయి. ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేస్తే అయిదు శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులను ఉపయోగించాలి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డులు, ఈంఐ లావాదేవీలకు పది శాతం మేర డిస్కౌంట్‌ దక్కుతుంది.   

Updated Date - 2022-08-06T06:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising