ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క నెలలో యూపీఐ లావాదేవీలు పది లక్షల కోట్లకు పైనే!

ABN, First Publish Date - 2022-09-03T08:41:45+05:30

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) ద్వారా ఒక్క ఆగస్టు నెలలోనే భారతదేశంలో రూ.10.72 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) ద్వారా ఒక్క ఆగస్టు నెలలోనే భారతదేశంలో రూ.10.72 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. 657 కోట్ల ట్రాన్సాక్షన్ల ద్వారా ఈ మొత్తం జరిగినట్లు ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’(ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఏటికేడాది వ్యవహారాల్లో 75 శాతం, నగదులో  వంద శాతం పెరుగుదల నమోదవుతోంది. రాన్రాను యూపీఐ  వ్యవహారం పటిష్టమవుతుండటమే కాదు, ఒక్కో లావాదేవీకి సంబంధించి సగటు మొత్తం కూడా పెరుగుతోంది. మన దేశంలో అంతకుమునుపు నెలలోనే తొలిసారి లావాదేవీలు ఆరు బిలియన్లకు మించాయి. 6.28 బిలియన్లకు గాను మార్పిడి జరిగిన మొత్తం రూ.10.62 లక్షల కోట్లుగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో 46 బిలియన్ల మేర లావాదేవీలతో రూ.84.17 ట్రిలియన్ల   మొత్తం చేతులు మారింది. అలా ఒక ట్రిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించింది. రాబోయే అయిదేళ్ళలో రోజుకు బిలియన్‌ లావాదేవీలు జరగాలన్నది యూపీఐ లక్ష్యం. రఘురామ రాజన్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న రోజుల్లో అంటే 2016 ఏప్రిల్‌ 11న యూపీఐ సదుపాయం ఆరంభమైంది. అలాగే లొకేషన్‌ని రికార్డు చేయడంలో క్లయింట్‌ పర్మిషన్‌ తప్పనిసరని, అలా చేయని పక్షంలో కఠిన చర్య తీసుకుంటామని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2022-09-03T08:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising