ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే నిషేధమే!

ABN, First Publish Date - 2022-10-22T07:26:24+05:30

పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సభ్యుల ప్రయోజనాలు, భద్రతను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటూ ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సభ్యుల ప్రయోజనాలు, భద్రతను  కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. నిబంధనలను అతిక్రమించిన యూజర్లను నిషేధిస్తుంది. ఒక్క ఆగస్టు నెలలోనే ఇరవై మూడు లక్షల మంది ఇండియన్‌ అకౌంట్లపై నిషేధం విధించింది. వాట్సాప్‌ విడుదల చేసిన యూజర్‌ సేఫ్టీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అసలు బ్యాన్‌కు కారణాలు అనేకం. నోటీసు కూడా ఇవ్వకుండా తొలగిస్తుంది. నోటిఫై కూడా చేయదు. సెక్యూరిటీ చర్యలకు తోడు యూజర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. అందుకోసం స్పామ్‌ డిటెక్షన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. షేర్‌ చేసిన మెసేజెస్‌లో అనుచిత వైఖరి అంటూ ఏమైనా ఉంటే అది గుర్తిస్తుంది. దరిమిలా అకౌంట్‌ నిషేధానికి గురికాకుండా ఉండాలంటే కింది చర్యలు తీసుకోవడం మంచిది.


మెసేజ్‌లను ఫార్వార్డ్‌ చేయడంలో వాట్సాప్‌ పరిమితులు విధించింది. షేరింగ్‌కు ముందు మరోసారి యోచించేందుకే ఆ పరిమితులు పెట్టింది. మెసేజ్‌ క్రెడిబిలిటీపై అపనమ్మకం ఉంటే ఫేక్‌, ఫాల్స్‌ మెసేజ్‌లను పంపకుండా ఉండటమే మంచిది.

బల్క్‌ మెసేజింగ్‌ వద్దని కూడా సూచిస్తోంది. వాట్సాప్‌ మెసేజ్‌ల విషయంలో మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగిస్తోంది. అలాగే యూజర్ల నుంచి వచ్చే నివేదికలను సైతం పరిశీలిస్తుంది. ఆనుచిత, ఆటోమేటెడ్‌ మెసేజ్‌లను కనుగొని సదరు అకౌంట్లను బ్యాన్‌ చేస్తుంది. 

బ్రాడ్‌కాస్ట్‌ లిస్టు ఉపయోగించి పంపే మెజేజ్‌లను అందుకోవాలంటే, యూజర్లు ఆ జాబితాలో ఉండాలి. బ్రాడ్‌కాస్ట్‌ మెసేజ్‌లను తరచూ ఉపయోగిస్తే అది ఫిర్యాదుకు అంతిమంగా అకౌంట్‌ నిషేధానికి దారితీస్తుంది. 

గ్రూపులోకి ఎవరినైనా చేర్చుకునే ముందు యూజర్ల పర్మిషన్‌ తీసుకోవాలి. ఒక యూజర్‌ మెసేజ్‌లను తనకు వద్దు అంటే వెంటనే ఆ వ్యక్తిని గ్రూపు నుంచి తొలగించాలి. మెసేజ్‌లను పంపడం కూడా ఆపేయాలి.

తమను ముందుగా కాంటాక్ట్‌ అవుతారో వారికి మాత్రమే మెసేజ్‌లను పంపాలి. ఇంకా బాగా చెప్పాలంటే ముందుగా కాంటాక్ట్‌ అయ్యేలా చూసుకోవాలి.

వాట్సాప్‌ నిబంధనలను అతిక్రమిస్తేనే అకౌంట్‌ బ్యాన్‌ అవుతుందని గుర్తుంచుకోవాలి. రూమర్లను షేర్‌ చేయడం, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, అన్యాయ - పరువునష్టం కలిగించే విధంగా ఉండటం, పీడించుకునే స్వభావం ఉండటం వంటివి కూడదు. 

Updated Date - 2022-10-22T07:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising