ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడిగా ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌!

ABN, First Publish Date - 2022-10-01T06:08:06+05:30

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఏది కావాలనుకుంటే అటువైపు మళ్ళే సౌలభ్యాన్ని మెటా కల్పిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఏది కావాలనుకుంటే అటువైపు మళ్ళే సౌలభ్యాన్ని మెటా కల్పిస్తోంది. ఈ సరికొత్త అకౌంట్‌ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. ఇది ఓకే అయితే ఫేస్‌బుక్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు అటు నుంచి ఇటుకు మళ్లవచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌కు తోడు వెబ్‌ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను తెస్తున్నారు. ఒకే అకౌంట్‌ సెంటర్‌తో ఆ రెంటిని కలుపుకొనే వెసులుబాటుని కల్పిస్తోంది. ఆ మేరకు అధికారిక ప్రకటనను కూడా మెటా విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఫేస్‌బుక్‌ లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌తోనే లాగిన్‌ అయి అదనపు అకౌంట్‌ ప్రొఫైల్‌కు సైనప్‌ చేయవచ్చు. ఆ రెంటిని ‘యువర్‌ ప్రొఫైల్‌ పేజెస్‌’ సెక్షన్‌లో మెనూ టాబ్‌లో చూసుకోవచ్చు. క్రియేట్‌ లేదంటే యాక్సెస్‌ కోసం రెంటిలో దేని లాగిన్‌ క్రెడెన్షియల్స్‌నైనా ఉపయోగించుకోవచ్చు. ఈ అప్‌డేట్‌ అలాగే దీని భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, గుర్తింపునకు నోచని డివైస్‌ నుంచి యాక్సెస్‌ పొందే సౌకర్యం కూడా ఉండదని మెటా తెలిపింది. 

Updated Date - 2022-10-01T06:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising