ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటెంట్‌ తొలగింపు అరవై వేలకు పైమాటే

ABN, First Publish Date - 2022-01-08T05:30:00+05:30

గూగుల్‌ ఒక్క నవంబరు నెలలోనే 61,114 కంటెంట్‌ పీసులను తొలగించింది. ఇవన్నీ మన దేశానికి సంబంధించినవే. 26,087 ఫిర్యాదులకు స్పందించి గూగుల్‌ ఈ చర్య తీసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ ఒక్క నవంబరు నెలలోనే 61,114 కంటెంట్‌ పీసులను తొలగించింది. ఇవన్నీ మన దేశానికి సంబంధించినవే. 26,087 ఫిర్యాదులకు స్పందించి గూగుల్‌ ఈ చర్య తీసుకుంది. వీటికి తోడు ఆటోమేటిక్‌ డిటెక్షన్‌ కింద మరో 3,75,468 కంటెంట్‌ పీసులను కూడా తీసేసింది. అక్టోబరులో ఫిర్యాదులు 24,569 కాగా తొలగించిన కంటెంట్‌ పీసులు 48,594. ఆటోమేటిక్‌ డిటెక్షన్‌ పరిధిలో మరో 3,84,509 పీసులను తీసేసింది. మూడో పార్టీ కంటెంట్‌పై ఫిర్యాదులు రాగా, స్థానిక చట్టాలను అనుసరించి లేనందున వాటిని తొలగించినట్టు గూగుల్‌ ఒక నివేదికలో వివరించింది. మేధా సంపత్తి హక్కులు ఉల్లంఘించారంటూ కొన్ని, పరువునష్టం తదితరాల పేరిట మరికొన్ని ఫిర్యాదులు అందాయి. ఏడు కేటగిరీల కింద ఫిర్యాదులను విభజించి,  హద్దు మీరిన కంటెంట్‌ను తొలగించారు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించిన యావత్తు కంటెంట్‌ను తొలగిస్తామని గూగుల్‌ ఈ సందర్భంలో తెలిపింది. 

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising