ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాపిల్‌ మ్యూజిక్‌లో కచేరి మోడ్‌

ABN, First Publish Date - 2022-12-10T11:16:37+05:30

యాపిల్‌ మ్యూజిక్‌ ‘కచేరి(కరోకి) స్టయిల్‌ మోడ్‌’ని తీసుకువస్తోంది. యాపిల్‌ మ్యూజిక్‌ సింగ్‌ పేరిట దీన్ని ఆరంభించింది. లక్షల పాటల సరసన నిలుచుని ఆలపించిన అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్‌ మ్యూజిక్‌ ‘కచేరి(కరోకి) స్టయిల్‌ మోడ్‌’ని తీసుకువస్తోంది. యాపిల్‌ మ్యూజిక్‌ సింగ్‌ పేరిట దీన్ని ఆరంభించింది. లక్షల పాటల సరసన నిలుచుని ఆలపించిన అనుభూతిని దీంతో యూజర్లకు కలిగించనుంది. అలాగే యూజర్‌కి తన గానాన్ని వినే సౌకర్యం కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ టీవీ 4కెలో అలాగే యాపిల్‌ మ్యూజిక్‌ చందాదారులందరికీ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తుంది. మ్యూజిక్‌ లవర్స్‌ సాధారణంగా తమకు నచ్చిన పాటతో గొంతు కలపడం సహజమని, దానికి సంబంధించి మంచి అనుభవాన్ని వారికి కలుగజేస్తున్నామని యాపిల్‌ మ్యూజిక్‌ చెబుతోంది. సంప్రదాయ కచేరీల మాదిరిగానే ఉండే ఫీచర్‌తో ఇది వస్తోంది. అడ్జస్టబుల్‌ ఓకల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ ఓకల్స్‌, డ్యూయెట్లకు రియల్‌ టైమ్‌ లిరిక్స్‌ ఉన్నాయి. అలాగే కచేరి పాటలు, యుగళ గీతాలు, కోరస్‌, ఇతర గీతాలతో 50కి పైగా ప్లే లిస్టులను కూడా ఈ ఫీచర్‌తో తీసుకువస్తోంది.

Updated Date - 2022-12-10T11:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising