ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్‌ చేసినా లభ్యం!

ABN, First Publish Date - 2022-08-20T05:45:05+05:30

డిలీట్‌ చేసిన సమాచారం, ఫొటోలు తిరిగి పొందగలిగితే అంతకుమించి ఆనందించదగ్గ విషయం ఏముంటుంది! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది వాస్తవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిలీట్‌ చేసిన సమాచారం, ఫొటోలు తిరిగి పొందగలిగితే అంతకుమించి ఆనందించదగ్గ విషయం ఏముంటుంది! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది వాస్తవంగా జరిగింది. ఏడాది కింద డిలీట్‌ చేసిన డేటా లభ్యమైందని సెక్యూరిటీ రీసెర్చర్‌ సౌగత్‌ పోఖరెల్‌ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ సర్వర్‌ నుంచి పూర్తిగా డిలీట్‌ కావడం అంటూ ఉండదని దీంతో భావిస్తున్నారు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌(హార్డ్‌వేర్‌ లేదంటే సాఫ్ట్‌వేర్‌లో అనూహ్యంగా ఎదురయ్యే సమస్య)ని గత అక్టోబర్‌లోనే సౌగత్‌ కనుగొన్నారు. ఇందుకుగాను ఇన్‌స్టాగ్రామ్‌ ఆయనకు ఆరువేల డాలర్లను బహుమతిగా కూడా ఇచ్చింది. యాప్‌లోని ‘డౌన్‌లోడ్‌ యువర్‌ ఇన్ఫర్మేషన్‌’ టూల్‌ని ఉపయోగించి తొలగించిన సమాచారాన్ని పొందినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు ‘టెక్‌క్రంచ్‌’కు తెలిపారు. అయితే ఈ విషయంలో ఏదో దుర్వినియోగం జరిగినట్టు ఆధారం మాత్రం లభ్యం లేదని స్పష్టం చేశారు. ఇదేమి సాధారణ విషయం కాదని, డిలీట్‌ చేసిన డేటా యూజర్లు అందరికీ లభిస్తుందని కూడా చెప్పలేమన్నారు. డిలీట్‌ చేసిన డేటా సాధారణంగా నిర్దేశితకాలం వరకు లభిస్తాయి. డిలీట్‌ చేసిన డేటా ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిగా తొలగేందుకు 90 రోజులు పడుతుంది. అదేవిధంగా డిలీట్‌  అయినవి సంవత్సరాల తరవాత లభ్యం కావడం మునుపు ట్విటర్‌లోనూ చోటుచేసుకుంది.

Updated Date - 2022-08-20T05:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising