ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబ్రేన్‌ మొదటి గాగుల్స్‌

ABN, First Publish Date - 2022-09-17T08:09:40+05:30

అంబ్రేన్‌ గ్లేర్స్‌ తన మొదటి స్మార్ట్‌ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ఇండియన్‌ టెక్‌ కంపెనీ అంబ్రేన్‌ రిలీజ్‌ చేసింది. ఇవి ఓపెన్‌ ఇయర్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబ్రేన్‌ గ్లేర్స్‌ తన మొదటి స్మార్ట్‌ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ఇండియన్‌ టెక్‌ కంపెనీ అంబ్రేన్‌ రిలీజ్‌ చేసింది. ఇవి ఓపెన్‌ ఇయర్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్స్‌కు తోడు బ్లూటూత్‌ వి5.1ని సపోర్ట్‌ చేస్తాయి. యూనిసెక్స్‌ డిజైన్‌ కలిగి ఉన్న ఈ గ్లాసెస్‌ ఫ్రేమ్‌కు సంబంధించి రెండు ఆప్షన్స్‌ - రౌండ్‌, స్క్వేర్‌ షేపులను ఆఫర్‌ చేస్తోంది. అంబ్రేన్‌ విడుదల చేసిన వీటితో కలిపి మన దేశీయ మార్కెట్‌లోకి ఈ ఏడాది వచ్చిన వెరైటీల్లో ఇది మూడోది. టైటాన్‌, నాయిస్‌ ఇంతకు మునుపే తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. 


వీటిలో దాగి ఉన్న స్పీకర్లను మల్టీ ఫంక్షనల్‌ టచ్‌ కంట్రోల్స్‌ నియంత్రిస్తాయి. ఐపీఎక్స్‌ 4 రేటింగ్‌ ఉంది. వాటర్‌ రెసిస్టెంట్‌ కూడా. ఈ గ్లాసులు ఆడియో టెక్నాలజీని ఇంటిగ్రేట్‌ చేస్తాయి. లౌడ్‌ యాంబియంట్‌ నాయిస్‌ను దీన్లోని స్పీకర్లు తొలగిస్తాయి. సింగిల్‌ చార్జ్‌తో ఏడు గంటల సేపు బ్యాటరీ బ్యాకప్‌నకు కంపెనీ హామీ ఇస్తోంది. వీటి కనెక్టివిటీ పరిధి పది మీటర్లు. వీటి టచ్‌ కంట్రోల్స్‌ ముఖ్యంగా కాల్స్‌ను ఆమోదించవచ్చు, రిజెక్ట్‌ కూడా చేయవచ్చు. మ్యూజిక్‌ కంట్రోల్‌కు తోడు వాయిస్‌ అసిస్టెంట్లను యాక్టివేట్‌ చేస్తాయి. యూవీ400 సర్టిఫైడ్‌ గ్లాసెస్‌ ఇవి. అంబ్రేన్‌ గ్లేర్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం వీటి ధర రూ.9,999. అయితే వీటిని 50 శాతం డిస్కౌంట్‌కు అంటే రూ.4,999కి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ డిస్కౌంట్‌ ఎంతకాలం ఉంటుందన్నది మాత్రం తెలియదు. మాన్యుఫాక్చరింగ్‌ డిఫెక్ట్‌పరంగా ఏడాది పాటు వారెంటీని కూడా ఇస్తోంది. 

Updated Date - 2022-09-17T08:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising