ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జర్నలిస్టు పేరును బయటపెట్టేసిన వృద్ధిమాన్ సాహా

ABN, First Publish Date - 2022-03-06T01:28:38+05:30

టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఎట్టకేలకు తనను బెదిరించిన వికెట్ కీపర్ పేరును బయటపెట్టాడు. జర్నలిస్టు తనను బెదిరించిన విషయం చెబుతూ స్క్రీన్‌షాట్లు షేర్ చేసిన తర్వాత పెద్ద దుమారమే రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఎట్టకేలకు తనను బెదిరించిన వికెట్ కీపర్ పేరును బయటపెట్టాడు. జర్నలిస్టు తనను బెదిరించిన విషయం చెబుతూ స్క్రీన్‌షాట్లు షేర్ చేసిన తర్వాత పెద్ద దుమారమే రేగింది. వెంటనే స్పందించిన బీసీసీఐ ఈ ఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటినీ ఏర్పాటు చేసింది. తొలుత ఆ జర్నలిస్టు పేరు వెల్లడించడానికి నిరాకరించిన సాహా తాజాగా కమిటీ ఎదుట అతడి పేరును వెల్లడించాడు. 


ఈ ఘటనకు సంబంధించి అవసరమైన మొత్తం సమాచారాన్ని కమిటీకి సాహా అందించాడని, దానిని బోర్డుకు పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. బీసీసీఐ నియమిత కమిటీలో రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు  ప్రభ్‌తేజ్ భాటియా సభ్యులుగా ఉన్నారు. తనతో మాట్లాడేందుకు నిరాకరించిన సాహాను జర్నలిస్టు బెదిరించాడు.



దీంతో అతడితో జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్లను షేర్ చేసిన సాహా.. జర్నలిజం మరీ దారుణంగా దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, తనను బెదిరించిన జర్నలిస్టు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించబోనని, బీసీసీఐ అడిగితే మాత్రం చెబుతానని స్పష్టం చేశాడు. అన్నట్టుగానే ఇప్పుడు బీసీసీఐ నియమిత కమిటీకి అతడి వివరాలు అందించాడు. దీంతో ఆ జర్నలిస్టు విషయంలో బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్నది ఉత్కంఠగా మారింది.  

Updated Date - 2022-03-06T01:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising