ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World Athletics: Japan జట్టులో ఏడుగురు క్రీడాకారులకు కొవిడ్

ABN, First Publish Date - 2022-07-19T17:46:04+05:30

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే జపాన్ జట్టులోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో:  ప్రపంచ అథ్లెటిక్స్ (World Athletics)ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే జపాన్(Japan) జట్టులోని(Team) ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు మారథాన్ రన్నర్‌లతో సహా ఏడుగురికి జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్(COVID) అని తేలినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు కరోనా సోకిన విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్, జపాన్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్, ఈవెంట్ నిర్వాహకులు చెప్పారు. ఒరెగాన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లలో ఎండ్యూరెన్స్ అథ్లెట్లు, సిబ్బందికి కరోనా సోకింది. ఇద్దరు మారథాన్ రన్నర్‌లు, నలుగురు సహాయక సిబ్బంది, జట్టు ప్రధాన కోచ్‌కు పాజిటివ్ పరీక్షలు వచ్చాయి.కరోనా సోకిన ఏడుగురిని ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంచారు. వారు మరో ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారని ప్రకటన పేర్కొంది.‘‘జపనీస్ ప్రతినిధి బృందంలో ఛాంపియన్‌షిప్‌లకు హాజరైన అన్ని జట్ల క్రీడాకారుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు తీసుకున్నాం’’అని ప్రకటన తెలిపింది.




ఈ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనే క్రీడాకారులకు ముందుజాగ్రత్తగా కొవిడ్ టీకాలు వేశామని అధికారులు చెప్పారు. జపనీస్ ప్రతినిధి బృందంలోని మిగిలిన సభ్యులందరూ ఇతర ప్రతినిధులతో ఉమ్మడి స్థలాలను పంచుకోకుండా ఉండాలని సూచించారు. బ్రిటీష్ అథ్లెట్ మోర్గాన్ లేక్ కొవిడ్ -19 బారిన పడిన తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుంచి వైదొలగవలసి వచ్చింది.


Updated Date - 2022-07-19T17:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising