ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 World Cup: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ?...10రోజుల్లో ప్రకటిస్తామని టీమ్ ఇండియా చీఫ్ కోచ్ వెల్లడి

ABN, First Publish Date - 2022-10-05T13:12:23+05:30

టీ 20 ప్రపంచకప్(T20 World Cup) టీమిండియా క్రికెట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని(Mohammed Shami) తీసుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టీ 20 ప్రపంచకప్(T20 World Cup) టీమిండియా క్రికెట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని(Mohammed Shami) తీసుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తాయి.ఈ వారం ప్రారంభంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో, రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశం జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. బీసీసీఐ బుమ్రా స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 లో టీమ్ ఇండియా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత జట్టులో బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని తీసుకుంటారా అని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను(head coach Rahul Dravid) విలేకరులు అడిగారు.‘‘బుమ్రా స్థానంలో ఎవరు ఉంటారో, మేం చూస్తాం, మాకు అక్టోబర్ 15వతేదీ వరకు సమయం ఉంది కాబట్టి షమీ స్పష్టంగా స్టాండ్‌బైలో ఉన్న వ్యక్తి. 14-15 రోజుల కోవిడ్ తర్వాత అతని స్థితి ఏమిటి అనే దాని గురించి మేం నివేదికలను పొంది నిర్ణయిస్తాం”అని మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ అన్నారు.



జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయంతో టీ20 ప్రపంచ కప్ నకు దూరమయ్యాడు.  బుమ్రా వెన్ను గాయం సంగతి గతనెల 29వ తేదీనే బయటపడినా.. వైద్య నివేదిక కోసం బోర్డు ఎదురుచూసింది. రిహాబిలిటేషన్‌ కోసం ఇప్పటిదాకా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో గడిపిన బుమ్రాకు కొన్ని నెలలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో విశ్వ సమరానికి అతడు దూరమవక తప్పడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌ కోసం బుమ్రా స్థానంలో షమి లేదా దీపక్‌ చాహర్‌లలో ఒకరు జట్టులోకి రానున్నారు. టీ20 ప్రపంచ కప్‌ ఈనెల 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది.  

Updated Date - 2022-10-05T13:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising