ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ-కోహ్లీ.. వీరిద్దరిలో ఎవరు బెస్ట్?: చర్చకు తెరలేపిన అభిమానులు

ABN, First Publish Date - 2022-06-15T02:39:24+05:30

మహేంద్రసింగ్ ధోనీ-విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ ఎవరు? ఇద్దరి గణాంకాలు వెలికి తీస్తూ అభిమానులు ఇప్పుడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహేంద్రసింగ్ ధోనీ-విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ ఎవరు? ఇద్దరి గణాంకాలు వెలికి తీస్తూ అభిమానులు ఇప్పుడీ చర్చకు తెరలేపారు. ధోనీ గురించి చెప్పుకోవాలంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అతడిది చెరగని ముద్ర. ఐసీసీలోని అన్ని ట్రోఫీలను అందుకున్న తొలి ఇండియన్ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌లు భారత్‌కు అందించి లెజెండ్ అనిపించుకున్నాడు.


షార్ట్ ఫార్మాట్‌లోనూ తిరుగులేదనిపించుకున్నాడు. కోహ్లీ విషయానికి వస్తే.. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియాను మరో మెట్టు ఎక్కించాడు. అయితే, ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా దేశానికి అందించలేకపోవడం మాత్రం కోహ్లీ కెప్టెన్సీలో కనిపించే ఒకే ఒక్క లోటు. ప్రత్యర్థులు ఎవరైనా సరే మైదానంలో కోహ్లీ దూకుడుగా ఉండేవాడు.


అయితే, వన్డేలు, టీ20ల్లో మాత్రం ధోనీతో కోహ్లీని పోల్చలేం. టెస్టుల్లో మాత్రమే వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అన్న చర్చ నిత్యం జరుగుతూనే ఉంటోంది. సంప్రదాయ క్రికెట్‌లో కోహ్లీనే బెస్ట్ అనేవాళ్లే ఎక్కువ. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ 54.80 సగటుతో 5,864 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఎక్కువ డబుల్ సెంచరీలు బాదిన కెప్టెన్‌గా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. అతడి ఖాతాలో ఏడు ‘డబుల్స్’ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో విరాట్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఛేజింగ్‌లోనూ వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నాడు.


ఈ విషయంలో ధోనీ కాస్తంత వెనక ఉన్నాడనే చెప్పాలి.  కెప్టెన్‌గా ఎంఎస్ 3,454 పరుగులు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో విదేశీ గడ్డ మీద టీమిండియా ఆరు మ్యాచ్‌లే గెలిచింది. 15 మ్యాచ్‌లు ఓడిపోయింది. విరాట్ కెప్టెన్సీలో విదేశాల్లో టీమిండియా 16 టెస్ట్‌ల్లో సత్తాచాటింది. 14 టెస్ట్‌ల్లో ఓడింది. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియా తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. విదేశాల్లో సక్సెస్‌కు కోహ్లీ దూకుడు పనికొచ్చింది. ఎటాకింగ్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అయింది. ఐదుగురు బౌలర్లతో బరిలో దిగడం కూడా ఫాస్ట్ ట్రాక్‌లపై కలిసొచ్చింది. ఇలా టెస్ట్‌ల్లో కొన్ని గణాంకాలు వెలికి తీసి కెప్టెన్‌గా విరాట్ బెస్ట్ అనే చర్చకు ఫ్యాన్స్ తెరలేపారు.

Updated Date - 2022-06-15T02:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising