ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోచ్‌కు పిలుపు

ABN, First Publish Date - 2022-01-28T09:23:44+05:30

భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం 15 మందితో కూడిన వెస్టిండీస్‌ జట్టును ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌తో సిరీస్‌కు విండీస్‌ జట్టు

సెయుంట్‌ జాన్స్‌ (ఆంటిగ్వా): భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం 15 మందితో కూడిన వెస్టిండీస్‌ జట్టును ప్రకటించారు. తొలిసారిగా చీఫ్‌ సెలెక్టర్‌ డెస్మండ్‌ హేన్స్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఈ జట్టుకు కీరన్‌ పొలార్డ్‌ నాయకత్వం వహిస్తుండగా, 92 వన్డేలు ఆడిన వెటరన్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌కు కూడా చోటు కల్పించారు. 2019లో అతడు చివరి వన్డే ఆడాడు. అలాగే మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఎన్‌క్రుమా బానర్‌, ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ కూడా తిరిగి జట్టులో చేరారు. ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ జరుగుతోంది. వచ్చే నెల 6 నుంచి మూడు వన్డేలు అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తారు. కాగా 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో జరిగే మూడు టీ20లకు విండీస్‌ జట్టును తర్వాత ప్రకటిస్తారు.


వన్డే సిరీస్‌కు విండీస్‌ జట్టు:

పొలార్డ్‌ (కెప్టెన్‌), ఫాబియెన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, షమర్‌ బ్రూక్స్‌, జేసన్‌ హోల్డర్‌, షాయ్‌ హోప్‌, నికోలస్‌ పూరన్‌, కీమర్‌ రోచ్‌, హేడెన్‌ వాల్ష్‌, అకీల్‌ హొసేన్‌, అల్జారి జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, షెఫెర్డ్‌, బానర్‌, ఒడీన్‌ స్మిత్‌.

Updated Date - 2022-01-28T09:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising