ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబర్ ఆజంపై ఫైర్ అవుతున్న అక్రమ్ వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ క్రికెటర్

ABN, First Publish Date - 2022-02-18T02:59:10+05:30

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బాబర్ ఆజం సారథ్యంలోని కరాచీ కింగ్స్ వరుస

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బాబర్ ఆజం సారథ్యంలోని కరాచీ  కింగ్స్ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆవిరి చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. మిగిలిన చివరి రెండు మ్యాచుల్లోనైనా విజయం సాధించి టోర్నీ నుంచి గౌరవంగా నిష్క్రమించాలని భావిస్తోంది.


బుధవారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల వద్దకు వచ్చి ఓటమి పాలైంది. చివరి రెండు ఓవర్లలో ముల్తాన్స్ విజయానికి 29 పరుగులు అవసరం కావడంతో కరాచీ జట్టు విజయం ఖాయమని అనుకున్నారు. అయితే, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ బౌలింగులో కుష్దిల్ షా రెండు సిక్సర్లు, ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.


 మ్యాచ్ జరుగుతుండగా బౌండరీ లైన్ వద్ద కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రెసిడెంట్ వసీం అక్రం.. బాబర్ ఆజంపై అరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బాబర్‌పై అక్రం మండిపడడాన్ని చూసిన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వసీంపై తీవ్ర విమర్శలు చేశారు.


దీంతో తాజాగా అక్రం ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తాను బాబర్‌పై నోరు పారేసుకోలేదని వివరణ ఇచ్చాడు. అభిమానుల స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. మన బౌలర్లు యార్కర్లు ఎందుకు సంధించలేకపోతున్నారు? స్లో బంతులు ఎందుకు విసరడం లేదని మాత్రమే బాబర్‌ను ప్రశ్నించానని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా బాబర్‌ను ప్రశంసించాడు. అతడో మంచి ఆటగాడని, విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తాడని అక్రం కొనియాడాడు. 



Updated Date - 2022-02-18T02:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising