ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli : ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇదీ..

ABN, First Publish Date - 2022-08-11T03:39:45+05:30

‘ఆసియా టీ20 కప్‌’లో (Asia Cup) ఆడే భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చోటివ్వడం ద్వారా జట్టులో అతడి స్థానంపై ఊహాగానాలకు బీసీసీఐ తెరదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ‘ఆసియా టీ20 కప్‌’లో (Asia Cup) ఆడే భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చోటివ్వడం ద్వారా అతడి స్థానంపై ఊహాగానాలకు బీసీసీఐ(BCCI) తెరదించింది. కోహ్లీ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్‌కు దిగే స్థానం నుంచి పలు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఏవిధంగా ఉందో ఓ లుక్కేద్దాం.. 


2018 ఎడిషన్‌లో ఆడకపోయినప్పటికీ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో జాబితాలో విరాట్ కోహ్లీ ఒకడిగా ఉన్నాడు. 971 పరుగులతో సచిన్ తెందుల్కర్ టాప్ స్కోరర్‌గా ఉండగా రోహిత్ శర్మ(883) 2వ స్థానం, 766 పరుగులతో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 16 ఇన్నింగ్స్‌లో ఈ పరుగులు చేయడం గమనార్హం. 2010 ఆసియా కప్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 67 పరుగులే చేశాడు. ఆ తర్వాత 2012 ఎడిషన్‌లో చెలరేగి ఆడాడు. 2 సెంచరీలు చేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు కూడా ఆ ఏడాదే నెలకొల్పాడు. మిర్‌పూర్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత 2014 ఎడిషన్‌లో కూడా సెంచరీ చేశాడు.


ఆసియా కప్.. టీ20 ఫార్మాట్‌లో మొదలైన 2016 సీజన్‌లో కూడా కోహ్లీ అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లో 41 పరుగులు చేసి శెభాష్ అనిపించుకున్నాడు. విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఆసియా కప్ మంచి అవకాశమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా కాగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభమనుంది. భారత్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. యూఏఈలోని దుబాయ్ కేంద్రంగా ఈ మ్యాచ్ జరగనుంది. 

Updated Date - 2022-08-11T03:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising