ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సవిత ఆధ్వర్యంలోనే.. ‘కామన్వెల్త్‌’ హాకీ జట్టు

ABN, First Publish Date - 2022-06-24T09:13:55+05:30

హాకీ ప్రపంచక్‌పతో పాటు ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భార త మహిళల జట్టుకు కూడా సవితా పుని యానే నాయకత్వం వహించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హాకీ ప్రపంచక్‌పతో పాటు ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భార త మహిళల జట్టుకు కూడా సవితా పుని యానే నాయకత్వం వహించనుంది. గురువారం ప్రకటించిన 18 మంది జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌ కీపర్‌ యతిమరపు రజనికి చోటు దక్కింది. జూలై 28 నుంచి ఆగస్టు 7వరకు బర్మింగ్‌హామ్‌లో ఈ గేమ్స్‌ జరుగుతాయి.


తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న మాజీ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ కామన్వెల్త్‌కు కూడా దూరం కానుంది. పూల్‌ ‘ఎ’లో భారత్‌, ఇంగ్లండ్‌, కెనడా, వేల్స్‌, ఘనా దేశాలున్నాయి. 29న సవిత సేన తొలి మ్యాచ్‌ను ఘనాతో ఆడనుంది. సవిత, రజని గోల్‌కీపర్లుగా వ్యవహరించనున్నారు. క్రితంసారి గోల్డ్‌కో్‌స్టలో జరిగిన కామన్వెల్త్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.


జట్టు:

సవిత పునియా (కెప్టెన్‌), రజని, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, గుర్జిత్‌ కౌర్‌, నిక్కీ ప్రధాన్‌, ఉదిత, నిశా, సుశీల చాను, మోనిక, నేహ, జ్యోతి, నవ్‌జ్యోత్‌ కౌర్‌, సలీమా టెటె, వందన కటారియా, లల్‌రెమ్‌ సియామి, నవ్‌నీత్‌ కౌర్‌, షర్మిలా దేవి, సంగీత కుమారి. 

Updated Date - 2022-06-24T09:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising