ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌ తొలిసారి..

ABN, First Publish Date - 2022-05-23T10:17:06+05:30

ఐపీఎల్‌లో బుల్లెట్‌ వేగంతో బంతులు విసిరి అందరి దృష్టినీ ఆకర్షించిన స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు టీ20 జట్టు 

హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌కు పిలుపు

టెస్టుల్లో పుజార పునరాగమనం

రెండో కీపర్‌గా తెలుగు క్రికెటర్‌ భరత్‌


న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో బుల్లెట్‌ వేగంతో బంతులు విసిరి అందరి దృష్టినీ ఆకర్షించిన స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కింది. అంతేకాదు డెత్‌ ఓవర్ల స్పెషలి్‌స్టగా పేరు తెచ్చుకున్న పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు కూడా తొలిసారి జాతీయ జట్టుకు ఆడబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో వచ్చే నెల 9 నుంచి 19వరకు స్వదేశంలో ఐదు టీ20ల సిరీస్‌ జరుగబోతోంది. ఇందుకోసం కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో 18 మందితో కూడిన భారత జట్టును ఆదివారం జాతీయ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.


కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, షమిలకు విశ్రాంతినిచ్చారు. అలాగే బెంగళూరు తరఫున అద్భుత ఫినిషర్‌గా మారిన వెటరన్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు కూడా సెలెక్టర్లు చోటివ్వడం విశేషం. తాజా లీగ్‌లో 57.54 సగటుతో 287 పరుగులతో ఆర్‌సీబీకి కీలక బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. 2019 వరల్డ్‌క్‌పలో డీకే చివరిసారి జట్టుకు ఆడాడు. ఇక గాయంతో చాలా రోజులుగా జాతీయ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తిరిగి బ్లూజెర్సీ ధరించనున్నాడు. గుజరాత్‌ జట్టు కెప్టెన్‌గా తను అద్భుత ఫామ్‌లో ఉండడంతో ఓ దశలో టీమిండియా పగ్గాలు కూడా అతడికే అప్పగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రుతురాజ్‌, ఇషాన్‌లతో పాటు ఐపీఎల్‌లో పేలవ ఆటతీరుతో నిరాశపరిచిన వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానాలను కాపాడుకున్నారు. అయితే విశేషంగా రాణిస్తున్న మరో పేసర్‌ మొహిసిన్‌ ఖాన్‌, బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి కూడా జట్టులో చోటు ఆశించినా నిరాశే ఎదురైంది. గాయం కారణంగా సూర్యకుమార్‌ జట్టుకు దూరమయ్యాడు. 


పుజారాకు చోటు:

టీ20తో పాటు గతేడాది ఇంగ్లండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టు కోసం 17 మందితో కూడిన జట్టును ప్రకటించారు. కౌంటీల్లో అదరగొడుతున్న చటేశ్వర్‌ పుజార తిరిగి జట్టుకు ఎంపికయ్యాడు. ససెక్స్‌ తరఫున అతడు 2 డబుల్‌, 2 సెంచరీలతో 720 రన్స్‌ చేయడంతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయక తప్పలేదు.  ఇక, సాహాపై వేటు పడడంతో ఆంధ్ర కుర్రాడు కేఎస్‌ భరత్‌ రెండో కీపర్‌ కాను న్నాడు. జూలై 1 నుంచి 5 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ టెస్టుకు సీనియర్‌ ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటారు.  


టీ20 జట్టు

కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌, ఇషాన్‌, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వైస్‌కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.


టెస్టు జట్టు

 రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, విహారి, పుజార, పంత్‌, కేఎస్‌ భరత్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌, షమి, బుమ్రా, సిరాజ్‌, ఉమేశ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.

Updated Date - 2022-05-23T10:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising