ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కుల్లో అండర్-19 ప్రపంచకప్ స్టార్ రాజ్‌వర్ధన్

ABN, First Publish Date - 2022-02-18T23:16:50+05:30

అండర్-19 ప్రపంచకప్ స్టార్ రాజ్‌వర్ధన్ హంగార్గేకర్ చిక్కుల్లో పడ్డాడు. రాజ్‌వర్ధన్ తన వయసును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్ స్టార్ రాజ్‌వర్ధన్ హంగార్గేకర్ చిక్కుల్లో పడ్డాడు. రాజ్‌వర్ధన్ తన వయసును తక్కువ చేసి చూపించాడంటూ మహారాష్ట్ర స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ఓంప్రకాశ్ బొకారియా ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలతో సహా బీసీసీఐకి లేఖ రాశారు.


మరాఠీ పబ్లికేషన్ ‘సామ్నా’ ప్రకారం..  టెర్నా పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన రాజ్‌వర్ధన్ అసలు వయసు 21 సంవత్సరాలు. రీ అడ్మిషన్ సందర్భంగా రాజ్‌వర్ధన్ తన పుట్టిన తేదీని 10 జనవరి 2001కి బదులుగా 10 నంబరు 2002కు మార్చాడు. ఫలితంగా ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది. రాజ్‌వర్ధన్ తన పుట్టిన తేదీని మార్చినట్టుగా ధరాశివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ గుప్తా ధ్రువీకరించిన పత్రాన్ని కూడా బొకారియా తన లేఖకు జోడించారు. 

 

అండర్-19 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రాజ్‌వర్ధన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో రాజ్‌వర్ధన్‌ను చెన్నై సూపర్ కింగ్స్  రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. మహారాష్ట్ర మరాఠ్వాడాలోని తుల్జాపూర్‌లో జన్మించిన రాజ్‌వర్ధన్ తొలుత ఆఫ్ స్పిన్నర్. విజయ్ మర్చంట్ ట్రోఫీలో మహారాష్ట్ర అండర్-16 జట్టుకు ఆడాడు.


2018 మొదట్లో రైట్ ఆర్మ్  ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు. ఆ తర్వాత సీనియర్ కేటగిరీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు అతడిపై వయసు సంబంధిత ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. 

Updated Date - 2022-02-18T23:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising