ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2022: బయోబబుల్‌లోకి ఇద్దరు కానిస్టేబుళ్లు.. కేసు నమోదు

ABN, First Publish Date - 2022-04-14T23:09:20+05:30

ఐపీఎల్ నేపథ్యంలో నీరుల్‌లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐపీఎల్ నేపథ్యంలో నీరుల్‌లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లకు బయటి వ్యక్తులతో సంబంధాలు లేకుండా ఉండేందుకు బయోబబుల్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారు.


మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ ఇతర పోలీసులు వారిస్తున్నా వినిపించుకోకుండా బయోబబుల్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఇతర పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. బయోబబుల్‌లోకి బలవంతంగా ప్రవేశించిన ఆ ఇద్దరినీ రవీంద్ర మాటే (33), నరేంద్ర నాగ్‌పురే (36)లుగా గుర్తించారు. 11న రాత్రి 10.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-04-14T23:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising