ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20worldcup: టీ20 వరల్డ్ కప్‌లో ఏ జట్టుకి ఎంత ప్రైజ్ మనీ దక్కిందో తెలుసా.. సెమీస్ ఆడిన ఇండియాకి కూడా..

ABN, First Publish Date - 2022-11-13T22:02:35+05:30

టీ20 వరల్డ్ కప్ 2022 (T20 world cup) విజేతగా ఇంగ్లండ్ (England) అవతరించింది. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్తాన్‌పై (PakistanVsEngland) ఘనవిజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ 2022 (T20 world cup) విజేతగా ఇంగ్లండ్ (England) అవతరించింది. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్తాన్‌పై (PakistanVsEngland) ఘనవిజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌ను (T20 world cup) రెండుసార్లు ముద్దాడిన రెండవ జట్టుగా ఇంగ్లండ్ రికార్డ్ సృష్టించింది. అంతక్రితం వెస్టిండీస్ (Westindies) మాత్రమే రెండుసార్లు టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అయితే ఈసారి విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్, రన్నర్‌గా మిగిలిన పాకిస్తాన్ జట్లకు ఎంత ప్రైజ్‌మనీ దక్కనుంది?, ఇతర జట్లకు కూడా ఏమైనా దక్కుతుందా? అనే సందేహాలున్నాయి. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఈసారి విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు రూ.13.84 కోట్ల మొత్తం ప్రైజ్‌మనీ దక్కింది. ఇక రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ రూ.7.4 కోట్లు ప్రైజ్‌మనీ గెలుచుకుంది. ఇక సెమీ ఫైనల్స్‌లో ఇంటిదారి పట్టిన న్యూజిలాండ్‌ రూ.4.19 కోట్లు, టీమిండియాకి రూ.4.5 కోట్లు చొప్పున నగదు దక్కింది. సూపర్-12 దశలో న్యూజిలాండ్ కంటే టీమిండియా విజయాలు ఎక్కువగా ఉండడంతో అమౌంట్ కాస్త ఎక్కువగా అందింది. మరోవైపు సూపర్-12 దశలో ఆకట్టుకున్న నెదర్లాండ్స్ రూ.1.85 కోట్లు, ఆస్ట్రేలియా రూ.1.53 కోట్లు, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు చెరో రూ.1.2 కోట్లు, జింబాబ్వే రూ.88.5 లక్షలు చొప్పున ప్రైజ్ మనీ గెలుచుకున్నాయి.

Updated Date - 2022-11-13T22:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising