ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asia Cup 2022 : భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వ్యాఖ్యలివీ.. ఏమన్నాడంటే..

ABN, First Publish Date - 2022-08-12T01:00:00+05:30

ఆసియా కప్ 2022 (Asia Cup 2022) భాగంగా భారత్ (India) తన తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్తాన్‌పై(Pakistan) ఆడనుంది. ఆగస్టు 28న(ఆదివారం) యూఏఈలోని దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆసియా టీ20 కప్ 2022 (Asia Cup 2022) భాగంగా భారత్ (India) తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో(Pakistan) తలపడనుంది. ఆగస్టు 28న(ఆదివారం) యూఏఈలోని దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ ఆటగాళ్లకు విభిన్నమైన సవాలు అని ఒప్పుకున్నాడు. ఒక సాధారణ మ్యాచ్‌గా భావించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. మానసికంగా ఎంత సిద్ధపడ్డా ఆటగాళ్లపై ప్రత్యేక ఒత్తిడి ఉంటుందని బాబర్ అన్నాడు. నెదర్లాండ్ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడుతూ బాబర్ ఈ విధంగా స్పందించాడు. కాగా పాక్ మాజీ ఆటగాడు సొహైబ్ మసూద్ కూడా ఇటివల ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర భావోద్వేగం కారణంగానే వరల్డ్ కప్ లాంటి ప్రధాన ఈవెంట్లలో భారత్ చేతిలో పాకిస్తాన్ భంగపాటుకు గురవుతోందన్నాడు. అయితే ఈ మధ్యకాలంలోనే ఇరుదేశాల మధ్య మ్యాచ్‌లను సాధారణ మ్యాచ్‌లుగానే భావించడం పాక్ ఆటగాళ్లు  మొదలుపెట్టారని మసూద్ చెప్పుకొచ్చాడు.


కాగా ఇరుజట్లు చివరిసారిగా టీ20 వరల్డ్ కప్ 2021 తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 150 పరులకుపైగా లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు బాబర్, మొహమ్మద్ రిజ్వాన్ అజేయంగా చేధించిన విషయం విధితమే. 

Updated Date - 2022-08-12T01:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising