ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్పులంటూ పుకారు.. తొక్కిసలాటలో చిక్కుకుపోయిన టెన్నిస్ స్టార్ Naomi Osaka

ABN, First Publish Date - 2022-05-30T21:41:25+05:30

బాక్సింగ్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో కాల్పులు జరుగుతున్నట్టు పుకార్లు వ్యాపించడంతో స్టేడియంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: బాక్సింగ్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో కాల్పులు జరుగుతున్నట్టు పుకార్లు వ్యాపించడంతో స్టేడియంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అప్పటి వరకు కేరింతల మధ్య ఉత్సాహంగా మ్యాచ్‌ను తిలకిస్తున్న అభిమానులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. న్యూయార్క్‌లోని బార్‌క్లేస్ సెంటర్‌లో ఆదివారం జరిగిందీ ఘటన. ఆ సమయంలో స్టేడియంలోనే ఉన్న టెన్నిస్ స్టార్ నావోమి ఒసాకా (Naomi Osaka) తొక్కిసలాటలో చిక్కుకుపోయింది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన ఆమె ఆ తర్వాత తన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది.  


జెర్వోంటా డేవిస్- రోలాండో రొమేరో మధ్య జరుగుతున్న మ్యాచ్ ముగియడానికి కొద్దిసేపటి ముందు అంటే దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరుగుతున్నట్టు పెద్దగా అరుపులు వినిపించడంతో భయపడిన ప్రేక్షకులు తప్పించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీసినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటన తర్వాత జరిగిన దర్యాప్తులో స్టేడియం లోపల ఎలాంటి కాల్పులు జరగలేదని న్యూయర్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) తెలిపింది.

 

తొక్కిసలాట జరుగుతున్నప్పుడు మ్యాచ్ తిలకిస్తున్న ఒకాసా.. అది చూసి తాను భయంతో వణికిపోయానని  ట్వీట్ చేసింది. ‘‘బార్‌క్లేస్ సెంటర్‌లో ఉన్నప్పుడు అరుపులు, కేకలు వినిపించాయి. జనం ఒక్కసారిగా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. కాల్పులు జరుపుతున్నారన్న కేకలతో మేం ఒక రూములోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నాం’’ అని ఒకాసా ఆ ట్వీట్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. తనతోపాటు సెక్యూరిటీ గార్డు ఉండడం తన అదృష్టమని పేర్కొంది. తొక్కిసలాటలో గాయపడిన అమన్‌జోత్ కౌర్ మాట్లాడుతూ.. తుపాకితో ఓ షూటర్ కాల్పులు జరుపుతున్నట్టు అరుపులు వినిపించాయని పేర్కొన్నారు. తొక్కిసలాటలో ఆమె కిందపడిపోగా జనం ఆమెను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ‘‘ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను’’ అని ‘న్యూయార్క్ టైమ్స్’తో మాట్లాడుతూ చెప్పింది.



Updated Date - 2022-05-30T21:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising