ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడిలార్డర్‌లో తప్పించేదెవరినో?

ABN, First Publish Date - 2022-08-13T09:38:57+05:30

టీ20 ప్రపంచక్‌పనకు ఇంకెంతో సమయం లేదు. కానీ భారత జట్టు తుది కూర్పుపై సందేహాలు మాత్రం తీరడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచక్‌పనకు ఇంకెంతో సమయం లేదు. కానీ భారత జట్టు తుది కూర్పుపై  సందేహాలు మాత్రం తీరడం లేదు. ఇటీవలే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన కేఎల్‌ రాహుల్‌ తుది జట్టులో ఉండడం ఖాయమే. రోహిత్‌తో కలిసి అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగి, మూడో నెంబర్‌లో విరాట్‌ కోహ్లీని ఆడిస్తే మిడిలార్డర్‌లో ఎవరిపై వేటు వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.  ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌క్‌పలోనూ ఆ ముగ్గురినే టాపార్డర్‌లో పంపితే.. రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌, దినేశ్‌ కార్తీక్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ముగ్గురూ పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టేవారే. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్‌ పాండ్యా, జడేజా స్థానాలకు తిరుగులేకపోగా, కనీసం నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లు కచ్చితంగా జట్టులో ఉండాల్సిందే.


ఇదే జరిగితే ఐదుగురు బ్యాటర్స్‌తో బరిలోకి దిగడం సముచితంగా ఉంటుంది. వాస్తవానికి కోహ్లీ ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత దశాబ్ద కాలంగా అతడి స్థానానికి ఢోకా లేకపోయినా ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇక రాహుల్‌ గాయంతో చాలాకాలం నుంచి మ్యాచ్‌ ప్రాక్టీ్‌సకు దూరంగా ఉన్నాడు. అటు రోహిత్‌తో ఓపెనర్లుగా పంత్‌, సూర్యకుమార్‌ ఇటీవలి సిరీ్‌సలో మెరుగ్గా రాణించారు. ఇక డీకే ఫినిషింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో కోహ్లీ చోటు కోసం సెలెక్టర్లు ఎవరిపై వేటు వేస్తారనేది వేచిచూడాల్సిందే.

Updated Date - 2022-08-13T09:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising