ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వియటెక్‌ జోరుకు చెక్‌

ABN, First Publish Date - 2022-07-03T09:36:50+05:30

ఆల్‌ఇంగ్లండ్‌ క్లబ్‌లో సంచలనాల మోత. ఒకరుకాదు ఇద్దరుకాదు ఏకంగా నలుగురు సీడెడ్ల పరాజయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడోరౌండ్‌లో ఓడిన టాప్‌సీడ్‌

పెగులా, గాఫ్‌, క్రెజికోవా అదేబాట

లండన్‌: ఆల్‌ఇంగ్లండ్‌ క్లబ్‌లో సంచలనాల మోత. ఒకరుకాదు ఇద్దరుకాదు ఏకంగా నలుగురు సీడెడ్ల పరాజయం. వీరిలో టాప్‌సీడ్‌ స్వియటెక్‌ ఉండడం విశేషం. ఆమెతోపాటు ఎనిమిదో సీడ్‌ పెగులా, 11వ సీడ్‌ గాఫ్‌, 13వ సీడ్‌ క్రెజికోవా, రెండుసార్లు విజేత పెట్రా క్విటోవా మూడో రౌండ్‌లో కంగుతిన్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో 37వ ర్యాంకర్‌ అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌) 6-4, 6-2తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్వియటెక్‌ (పోలెండ్‌)కు షాకిచ్చింది. ఫలితంగా పోలెండ్‌ భామ వరుస 37 మ్యాచ్‌ల విజయ పరంపరకు తెరపడింది. పెట్రా మాట్రిక్‌ (క్రొయేషియా) 6-2, 7-6 (5)తో పెగులా (అమెరికా)ను చిత్తుచేసింది. కొకా గాఫ్‌ (అమెరికా) 7-6 (4), 2-6, 1-6తో తన దేశానికే చెందిన 20వ సీడ్‌ అనిసిమోవా చేతిలో, క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-2, 4-6, 3-6తో టొమ్లజొనోవిక్‌ (క్రొయేషియా) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక బడోసా (స్పెయిన్‌) 7-5, 7-6 (4)తో 15వ సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, హలెప్‌ (రొమేనియా) 6-4, 6-1తో మగ్దలీనా ఫ్రెక్‌ (పోలెండ్‌)పై, రిబకినా (కజకిస్థాన్‌) 7-6 (4), 7-5తో క్విన్‌వెన్‌ జెంగ్‌ (చైనా)పై, హార్మనీ టాన్‌ (ఫ్రాన్స్‌) 6-1, 6-1తో స్థానిక స్టార్‌ కేటి బౌల్టర్‌పై నెగ్గి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ఫ్రిట్జ్‌ 6-4, 6-1 7-6 (3)తో మోల్కన్‌ని, డిమినార్‌ 6-3, 6-4, 7-5తో బ్రాడీని ఓడించారు. 

Updated Date - 2022-07-03T09:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising