ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధు అదరగొట్టింది

ABN, First Publish Date - 2022-01-24T08:10:28+05:30

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సుదీర్ఘ టైటిల్‌ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సయ్యద్‌ మోదీ’ విజేత తెలుగు షట్లర్‌

వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప తర్వాత తొలి టైటిల్‌


లఖ్‌నవూ: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సుదీర్ఘ టైటిల్‌ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌ సింధు 21-13, 21-16తో యువ క్రీడాకారిణి మాళవికా బన్సోడ్‌పై విజయం సాధించింది. ఈ టైటిల్‌ను గెలవడం సింధుకిది రెండోసారి. 2017లో మొదటిసారి విజేతగా నిలిచింది. 2019 ఆగస్టులో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ గెల్చిన తర్వా త సింధు మళ్లీ టైటిల్‌ గెలవడం ఇదే తొలిసారి. కాగా..ఏడో సీడ్‌, భారత ద్వయం తనీషా/ఇషాన్‌ మిక్స్‌డ్‌ టైటిల్‌ అందుకుంది. ఫైనల్లో ఇషా జంట 21-16, 21-12తో సహచర జోడీ హేమనాగేంద్ర బాబు/శ్రీవిద్య గురజాడపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జోలీ, పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌/విష్ణువర్ధన్‌ జోడీలు ఫైనల్లో ఓటమి చవిచూశాయి. అర్నవ్‌ మెర్కెల్‌-లుకాస్‌ మధ్య జరగాల్సిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ను రద్దు చేశారు. ఫైనలిస్టుల్లో ఒకరు కరోనా బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2022-01-24T08:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising