ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవన్‌ను దాటేశాడు..

ABN, First Publish Date - 2022-09-30T09:22:14+05:30

పొట్టి ఫార్మాట్‌లో అదరగొడుతున్న డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరో అరుదైన ఘనత సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్‌లో అదరగొడుతున్న డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్‌ తరఫున ఓ క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2022లో ఆడిన అంతర్జాతీయ టీ20ల్లో అతడిప్పటి వరకు 732 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సూర్య అజేయ అర్ధసెంచరీతో నిలిచాడు. ఈక్రమంలో అతను 2018లో శిఖర్‌ ధవన్‌ 689 రన్స్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అలాగే మొత్తం 45 సిక్సర్లతో మహ్మద్‌ రిజ్వాన్‌ (2021లో 42)ను కూడా దాటేశాడు. గతేడాదే టీ20ల్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల సూర్య ఐసీసీ బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఈ ఏడాది 180కిపైగా స్ట్రయిక్‌ రేట్‌తో చెలరేగుతుండడం మరో విశేషం.

Updated Date - 2022-09-30T09:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising