ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suresh Raina: దేశవాళీ, ఐపీఎల్‌కు సురేష్ రైనా గుడ్‌బై... కారణం ఏంటో తెలిసిపోయింది

ABN, First Publish Date - 2022-09-06T20:42:31+05:30

టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా(Suresh Raina) అన్నీ ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా(Suresh Raina) దేశీయంగా అన్నీ ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌(IPL)కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్టు మంగళవారం ట్వీట్ చేశాడు. దేశం, సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ తరపున ఆడడం గౌరవంగా భావిస్తున్నానని రైనా వ్యాఖ్యానించాడు. బీసీసీఐ(BCCI), ఉత్తరప్రదేశ్ క్రికెట్ అకాడమీ(UPCACricket), ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజీవ్ శుక్లా‌తోపాటు తన సామర్థ్యంపై నమ్మకంతో అండగా నిలిచిన అభిమానులు అందరికీ రైనా ధన్యవాదాలు తెలిపాడు.


కాగా విదేశీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు అర్హత కోసమే సురేష్ రైనా ఈ నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ కూడా ఆడడం లేదు కాబట్టి.. వచ్చే ఏడాది సౌతాఫ్రికా ప్రారంభమవనున్న నూతన టీ20 లీగ్‌తోపాటు శ్రీలంక, యూఏఈ లీగ్‌లలో ఆడాలనుకుంటున్నాడు. ఈ కారణంగానే రానున్న దేశవాళీ సీజన్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడబోనని స్పష్టం చేశాడు. కాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన ఆగస్టు 15, 2020 రోజునే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో కొనసాగించిన చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఆ తర్వాత సీజన్‌లో అతడిని జట్టులో కొనసాగించలేదు. దీంతో యాక్టివ్ ఇండియా లేదా దేశవాళీ ఆటగాడిగా ఉండడంతో విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు సురేష్ రైనాకి సాధ్యపడలేదు. తాజా రిటైర్మెంట్ ఇక ఆటంకాలూ లేకుండా విదేశీ లీగ్స్‌లో ప్రాతినిధ్యం వహించవచ్చు. రైనా చివరిగా అక్టోబర్ 2021న ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

Updated Date - 2022-09-06T20:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising