ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణ ‘జ్యోతి’

ABN, First Publish Date - 2022-06-26T10:07:37+05:30

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో ఒకేరోజు రెండు పతకాలు కొల్లగొట్టి వారెవా అనిపించింది. సహచర ఆర్చర్‌ అభిషేక్‌ వర్మతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్చరీ ప్రపంచకప్‌లో సురేఖకు రెండు పతకాలు 

మిక్స్‌డ్‌లో పసిడి, 

వ్యక్తిగత విభాగంలో రజతం కైవసం


పారిస్‌: తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో ఒకేరోజు రెండు పతకాలు కొల్లగొట్టి వారెవా అనిపించింది. సహచర ఆర్చర్‌ అభిషేక్‌ వర్మతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన 25 ఏళ్ల సురేఖ.. ఇదే ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో రజత పతకం దక్కించుకొని సంతోషాన్ని ‘డబుల్‌’ చేసుకొంది. శనివారం ఇక్కడ జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో మూడోసీడ్‌ సురేఖ-అభిషేక్‌ జోడీ 152-149 స్కోరు తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన జీన్‌ బాల్చ్‌-డాడ్‌మంట్‌ జంటను చిత్తుచేసి చాంపియన్‌గా నిలిచింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌ పసిడి పతకం కావడం విశేషం. కాంపౌండ్‌ విభాగంలో అత్యంత విజయవంతమైన జోడీగా  పేరుగాంచిన సురేఖ-అభిషేక్‌ జోడీ అత్యుత్తమంగా గతేడాది ఇదే టోర్నీలో రజతం సాధించింది. ఆ తర్వాత జరిగిన కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ సురేఖ షూటా్‌ఫలో బ్రిటన్‌ ఆర్చర్‌ ఎల్లా గిబ్సన్‌ చేతిలో ఓటమిపాలై రజత పతకం అందుకుంది. అత్యంత ఉత్కంఠగా సాగిన తుదిపోరులో ఇద్దరూ దీటుగా బాణాలు సంధించడంతో 148-148తో స్కోరు సమమైంది.


రీ చేరువగా ఉండడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. ఇక, ఈ టోర్నీలో భారత్‌ ఖాతాలో ఆదివారం మూడో పతకం చేరనుంది. ఇప్పటికే మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దీపికా కుమారి, అంకితా భట్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌తో కూడిన భారత త్రయం ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. టైటిల్‌ పోరులో చైనాతో భారత బృందం తలపడనుంది. 

Updated Date - 2022-06-26T10:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising