ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srihari Nataraj: 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లోనూ సత్తా చాటిన నటరాజ్.. సెమీస్‌కు అర్హత

ABN, First Publish Date - 2022-07-31T23:00:38+05:30

ఇండియన్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ (Srihari Nataraj) 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలోనూ దూసుకెళ్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: ఇండియన్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ (Srihari Nataraj) 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలోనూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 54.55 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న నటరాజ్.. తాజాగా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను 25.52 సెకన్లలో పూర్తిచేసి సెమీస్‌కు అర్హత సాధించాడు. ఫలితంగా ఈ 21 ఏళ్ల బెంగళూరు స్విమ్మర్ తన హీట్‌లో రెండో అత్యంత వేగవంతమైన స్విమ్మర్‌గా, ఓవరాల్‌లో 8వ వేగవంతమైన స్విమ్మర్‌గా నిలిచాడు.  50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో నటరాజ్ వ్యక్తిగత అత్యుత్తమం 24.40 సెకన్లు. యూఏఈలో గతేడాది జరిగిన ఫినా వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఈ ఘనత సాధించాడు.  


పురుషుల 200 బటర్‌ఫ్లై విభాగంంలో సాజన్ ప్రకాష్ (Sajan Prakash) 1:58:99 సెకన్లలో సాధించి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తొలి 8  స్థానాల్లో నిలిచిన వారు 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో ఫైనల్‌లో తలపడతారు. 

Updated Date - 2022-07-31T23:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising